KCR Dramas: కేసీఆర్.. రాజకీయ రంగమార్తాండ.! అబద్దాల్లో ఏటా ఆస్కార్‌ ఆయనకే.!

అవే మాటలు..అవే మాయలు.. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ విషయంలోనూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనదైన మార్కు రాజకీయంతో అందరినీ బోల్తా కొట్టించారు. బీఆర్ఎస్‌ నేతలు ఇచ్చిన బిల్డప్‌ చూస్తే స్టీల్‌ప్లాంట్‌ను సింగరేణి కొనేసినట్లు, దానికి కేసీఆర్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అని పేరు కూడా పెట్టినట్లు అనిపించింది. తీరా చూస్తే ఏముంది ఫైనల్‌గా అందరి చెవిలో పూలు పెట్టేశారు కేసీఆర్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 21, 2023 | 04:15 PMLast Updated on: Apr 21, 2023 | 5:08 PM

Telangana Cm Kcr About Steel Plant Strategy

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ఎందుకు ప్రైవేటీకరిస్తారు అని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తుంటే రాజకీయం కోసం అనుకున్నారు. మేం కొనే అవకాశాలు పరిశీలిస్తామని అంటుంటే నిజమేమో అనుకున్నారు. ఇక సింగరేణిని రంగంలోకి దించగానే కేసీఆర్‌కు నిజంగానే దాన్ని కాపాడాలన్న ఆలోచన ఉంది అనుకున్నారు. సింగరేణి టీమ్‌ను పంపగానే ఇక విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కేసీఆర్‌ చేతుల్లోకి వెళ్లినట్లే అనుకున్నారు. తీరా ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రస్ట్‌ ముగిసేసరికి సార్‌ పత్తా లేకుండా పోయారు.

అరెరే ఏం డ్రామాలాడార్రా బాబు.. ఆస్కార్‌ అవార్డ్‌ సాధించిన నటులు కూడా ఆ నటనను చూసి సిగ్గుపడాలేమో.. ఒక్కొక్కరు ఒక్కో పాత్ర.. ప్రతి ఒక్కరూ రాజకీయ రంగమార్తాండలే.. తమకిచ్చిన డైలాగుల్ని అలవోకగా పలికించి డ్రామాను రక్తి కట్టించారు. కేసీఆర్ రంగంలోకి దిగితే అట్టుంటదని కేటీఆర్, మనం దిగితే కేంద్రం తగ్గాల్సిందే అని హరీష్.. కేసీఆర్ స్టీల్‌ప్లాంట్‌ సిరీయల్‌లో డైలాగులు పేల్చారు. దానిపై జరగాల్సినంత చర్చ జరిగాక ఇప్పుడు అంతా సైలెంట్.. అసలు లాభాల్లో ఉన్న సింగరేణినే నష్టాల్లోకి మళ్లేలా చేశారు.. అలాంటి సింగరేణి రూ.5వేల కోట్ల విలువైన స్టీల్‌ప్లాంట్‌ ఎఓఐలో పాల్గొనడమే పెద్ద జోక్. ఆ ప్రాక్టికల్‌ జోక్‌ను ఏపీ ప్రజలపై ప్లే చేసిన కేసీఆర్‌ను ఏం చేయాలంటారు.?

కేసీఆర్ చెప్పారంటే చేయరు..మాటలతో మంత్రం వేస్తారు. మత్తు దిగాక కానీ సార్‌ ఏం చేయలేదని, చేయబోరని అర్థం అవుతుంది. అబద్దాలను అందంగా అతికినట్లు చెప్పడంలో కేసీఆర్ దిట్ట.. అబద్దాల పునాదులపై అధికారం చెలాయించడం కేసీఆర్‌కే చెల్లింది. ఇప్పుడే కాదు మొదట్నుంచి ఆయన తాను చెప్పింది మాత్రం చేయరు. అబద్దాలకు ఆస్కార్‌ అవార్డ్‌ ఇవ్వాల్సి వస్తే ప్రతి ఏటా అది ఆయనకే దక్కుతుంది.

అధికారంలోకి వస్తే దళితుడ్ని సీఎం చేస్తా అన్నారు కేసీఆర్. రేపటి తెలంగాణ రాష్ట్రానికి దళిత నాయకుడే ముఖ్యమంత్రిగా ఉంటారన్నారు. తలనరుక్కుంటా కానీ మాట తప్పను అన్నారు. మరి దళితుడ్ని ముఖ్యమంత్రిని చేశారా.?ప్రతిపక్షాలు దానిపై ప్రశ్నిస్తే బీఆర్ఎస్‌ నేతలు నోరు మెదపరు. బంగారు తెలంగాణ కోసం కేసీఆర్ తనకు ఇష్టం లేకపోయినా అధికార భారాన్ని మోస్తురాంటూ బిల్డప్పులు ఇస్తారు. నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ ఉద్యమం చేసి తెలంగాణ సాధించారు. ఆ క్షణం నుంచే అబద్దాలు మొదలయ్యాయి. సోనియమ్మకు సాష్టాంగ నమస్కారం చేసి కాంగ్రెస్‌ను రాష్ట్రంలో తొక్కేశారు. ఇక నియామకాల విషయానికి వస్తే ఎన్ని ఉద్యోగాలిచ్చారో వారికే తెలియదు. అవిగో లక్ష నియామకాలు అని ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. రాష్ట్రంలో ప్రతి నిరుద్యోగికి రూ.3.016 భృతి ఇస్తానన్నారు ఏమైంది..? ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామన్నారు.. మరి అదెక్కడ…? కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు..దాని సంగతేంటి.? ప్రతి విద్యార్థికి ఫీజు రీఎంబర్స్‌మెంట్ ఇస్తామన్నారు. ఇస్తున్నారా.?

అమరవీరుల కుటుంబాలకు భూమి, డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లు, 10లక్షల సాయం అందించారా.? హుస్సేన్‌ సాగర్‌ను క్లీన్‌చేసి మంచినీటితో నింపేశారా..? దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్నారు.. ఎక్కడిచ్చారు.? ఇక పేదలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇస్తా అన్నారు.. ఎన్ని ఇచ్చారు.? కేంద్రం మెడికల్‌ కాలేజీలు ఇవ్వలేదు అంటారు.. కేంద్రం నుంచి అనుమతులు రాకుండానే ఇన్ని కాలేజీలు నడుస్తున్నాయా.? సింగరేణిలో ఓపెన్‌కాస్ట్‌ లేకుండా చేస్తానన్నారు. ఏమైంది.? వ్యవసాయానికి 24గంటలూ కరెంట్ ఇస్తామన్నారు.. అది ఎక్కడ అమలవుతోంది.? ఎస్సీ వర్గీకరణ గురించి ఇచ్చిన హామీలేమయ్యాయి.? పోడు భూముల సమస్య లేకుండా చేస్తా అన్నారు.. మరి ఇప్పటిదాకా ఆ సమస్య తేలలేదెందుకు.? దళితబంధు ఎంతమందికి ఇచ్చారు.? గిరిజనబంధు ఇస్తాం అన్నారు.. దాని సంగతేంటి.? మిషన్ భగీరథతో ఇంటింటికీ మంచినీళ్లు ఇచ్చారా.? మంచినీరు ఇవ్వకపోతే ఓట్లడగను అన్నది అబద్దామా.? బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం అబద్దమా..?

మాటలతో కనికట్టు చేయడంలో కేసీఆర్ దిట్ట… ఎప్పటికప్పుడు కొత్త కొత్త అబద్దాలు చెబుతూ పాతవాటిని మరిచిపోయేలా చేస్తారు. అవసరానికి తగినట్లుగా అబద్దాలు ఆడటంలో సార్‌ను మించిపోయిన వారు లేరు. ఎన్నిక వచ్చిందంటే చాలు సార్‌ నోటినుంచి అబద్దాలు అశువుగా వచ్చేస్తుంటాయి. వినేవారికి అది నిజంగానే జరిగిపోయినట్లు కనిపిస్తుంది. అబద్దాల కోటను అందంగా కట్టడంలో కేసీఆర్‌ను మించినవారు లేరు. ఇక రారు కూడా… గుడ్డిగా నమ్ముతున్న జనమే కేసీఆర్ బలం… కానీ జనం ఎల్లకాలం అలాగే ఉండరని సార్ గుర్తుంచుకోవాలి. జనం మారితే అబద్దపు మాటలపై కట్టిన ప్రగతీభవన్‌ పునాదులు కదులిపోతాయి.