Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ లో లోక్ సభ ఎలక్షన్ హీట్
మరో 3 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు వస్తుండటంతో తెలంగాణలో తమ పట్టును కొనసాగించడానికి కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. అందుకోసం రేపు విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తోంది. ఇందులో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దీపా దాస్ మున్షీ పాల్గొంటున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, లోక్ సభ ఎలక్షన్స్ లోనూ హీట్ కంటిన్యూ చేయాలని భావిస్తోంది. అందుకే 3 నెలల ముందు నుంచే సార్వత్రిక ఎన్నికలపై దృష్టిపెట్టింది. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జిగా కొత్తగా నియమితులైన ఏఐసీసీ ఇంచార్జ్ శ్రీమతి దీపా దాస్ మున్షి మంగళవారం హైదరాబాద్ కు వస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వస్తారు. ఆమెకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, ప్రోటోకాల్ చైర్మన్ హర్కర వేణుగోపాల్ తదితరులు స్వాగతం పలుకుతారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు గాంధీ భవన్ లో టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం. టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా లోక్ సభ ఎన్నికలకు ఎలా వెళ్ళాలో నేతలు చర్చించనున్నారు. ఆ తర్వాత రాష్ట్రంలో BRS, BJP నుంచి ఎమ్మెల్యేలు వస్తే చేర్చుకోవడం, వారికి మంత్రి వర్గంలో అవకాశం కల్పించడం లాంటి అంశాలను కూడా దీపాదాస్ మున్షీతో రేవంత్ చర్చిచే అవకాశముంది.