Telangana CM : తెలంగాణ కాంగ్రెస్ లో కుర్చీలాట.. రేవంత్ కి అడ్డుపడుతోంది ఎవరు ?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. కొన్నిగంటల్లో ఫలితాలు రాబోతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ వైపే చూపిస్తున్నాయి. బీఆర్ఎస్ కు మూడోసారి అధికారం దక్కక పోవచ్చని సర్వేలు చెబుతున్నాయి. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే.. నెక్ట్స్ తెలంగాణ సీఎం ఎవరవుతారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 1, 2023 | 02:56 PMLast Updated on: Dec 01, 2023 | 2:57 PM

Telangana Congress Chair Fight Who Is Obstructing Revanth

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. కొన్నిగంటల్లో ఫలితాలు రాబోతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ వైపే చూపిస్తున్నాయి. బీఆర్ఎస్ కు మూడోసారి అధికారం దక్కక పోవచ్చని సర్వేలు చెబుతున్నాయి. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే.. నెక్ట్స్ తెలంగాణ సీఎం ఎవరవుతారు. డజను మంది కాంగ్రెస్ లీడర్లు సీఎం కుర్చీపై ఆశలు పెట్టుకున్నారు. ఫలితాలు వెల్లడైన మరుక్షణమే.. ఢిల్లీ ఫ్లైట్ ఎక్కేస్తారు వీళ్ళంతా. కానీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీలీడర్ భట్టి విక్రమార్క మధ్య తీవ్రమైన పోటీ కనిపిస్తోంది.

BJP, Telangana : 15-20 స్థానాలపై బీజేపీ ఆశలు.. కమలనాథుల కోరిక నెరవేరేనా..?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే కాదు.. ఏ రాష్ట్రంలో అయినా కాంగ్రెస్ గెలిస్తే.. సీఎం పదవిపై పైరవీలు చేసే నాయకులు చాలా మందే ఉంటారు. మొన్నటికి మొన్న కర్ణాటకలోనూ అదే పరిస్థితి వచ్చింది. చివరకు డీకే శివకుమార్ ను బుజ్జగించిన కాంగ్రెస్ అధిష్టానం.. సిద్ధరామయ్యకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పరిస్థితి ఏంటి.. ఇక్కడ కూడా కుర్చీలాట గ్యారంటీగా మొదలవుతుంది. ఎన్నికలకు ముందు నుంచే సీఎం పీఠంపై చాలా మంది కామెంట్స్ చేశారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయని జానారెడ్డి కూడా నేనూ రేసులో ఉన్నా.. అని ఓ మాటేశారు. ఇంకా కోమటిరెడ్డి వెంకట రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి లాంటివాళ్ళు కూడా సీఎం రేస్ కి లైన్లో ఉన్నారు.

తెలంగాణ కాంగ్రెస్ నుంచి సీఎం పదవి కోసం ఎంతమంది రేసులో ఉన్నా.. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క మధ్య మాత్రమే గట్టి పోటీ ఉంటుంది. సీఎం కుర్చీ కోసం ఈ ఇద్దరి మధ్యా తగువులాట తప్పదనిపిస్తోంది. నిజానికి రేవంత్ రెడ్డి.. టీడీపీ నుంచి.. కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత.. నిస్తేజంగా ఉన్న హస్తం పార్టీలో ఫైర్ తెప్పించడంలో సక్సెస్ అయ్యాడు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఎన్నో ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు, ధర్నాలు చేయించాడు. నిరుద్యోగుల విషయంలో యూత్ కాంగ్రెస్ ను ముందుండి నడిపించాడు. ఆ విషయంలో విజయవంతం అయ్యాడు కూడా. కాంగ్రెస్ లో రేవంత్ సక్సెస్ రేటు బాగానే ఉంది.. కానీ రేవంత్ మీద కొన్ని ఆరోపణలు ఉండటం ఆయనకు మైనస్ గా మారింది. బ్లాక్ మెయిలింగ్ హిస్టరీ, ఓటుకు నోటు కేసు.. మరికొన్ని వివాదాలు అడ్డంకులుగా మారుతాయని భావిస్తున్నారు.

కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారాన్ని రేవంత్ ఒక్కడే స్టార్ కాంపైనర్ గా మారి నడిపించాడు. సొంతంగా డబ్బులు కూడా ఖర్చు పెట్టాడు. కర్ణాటక ఎన్నికల్లో డీకే శివకుమార్ లాగే.. తెలంగాణలో రేవంత్ ఖచ్చితంగా రోల్ ప్లే చేశాడు. అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం దగ్గర నుంచి సోషల్ మీడియా దాకా అన్నీ తానై నడిపాడు. ఒక రకంగా కాంగ్రెస్ గెలుపులో రేవంత్ దే కీలకపాత్ర. మరోవైపు సీఎం రేసులో భట్టి విక్రమార్క కూడా ఉన్నాడు. కాంగ్రెస్ కు విధేయుడిగా ఉంటూ ఎన్నో యేళ్ళుగా ఆ పార్టీని నమ్ముకున్నాడు. భట్టి సీఎల్పీ నేతగా ఉన్నప్పుడు.. బీఆర్ఎస్ నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినా.. కాంగ్రెస్ ను మాత్రం వీడలేదు. పైగా ఈ ఎన్నికలకు ముందు తెలంగాణలో పాదయాత్ర చేయడం ద్వారా పార్టీ మళ్లీ ఉనికి చాటడానికి ఉపయోగపడ్డాడు. భట్టిని ముఖ్యమంత్రిని చేస్తే.. ఎస్సీని సీఎం చేసిన ఘనత కాంగ్రెస్ కు దక్కుతుంది. అలాగే హై కమాండ్ విధేయుడుగా కూడా ఉంటాడు. భట్టిపై ఎలాంటి వివాదాలు గానీ.. బ్లాక్ హిస్టరీ కానీ లేదు. అంతేకాదు కాంగ్రెస్ లో మిగతా సీనియర్లు కూడా ఆయనకు సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి లాంటి సీనియర్ల మద్దతు భట్టికి లభిస్తుంది. కానీ తెలంగాణలో రెడ్డి లాబీ అంత తేలిగ్గా ముఖ్యమంత్రి పదవిని వదులుకుంటుదా అన్నది డౌటే. దాంతో పార్టీ విధేయుడా, విజయం వైపు నడిపించిన వాడా.. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరిని కాంగ్రెస్ అధిష్టానం ఎంచుకోవాల్సి ఉంటుంది.