TELANGANA CONGRESS: కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ నమ్మొచ్చా.. కాంగ్రెస్‌లో బీసీ అభ్యర్థులు ఎంతమంది..?
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏకంగా బీసీ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేస్తామని చెప్పింది. వేల కోట్లు ఖర్చు చేసి బీసీల అభివృద్ధికి బాటలు వేస్తామంటూ హామీలు ఇచ్చింది. ఇప్పటిదాకా అంతా బాగానే ఉంది. బీసీల మీద ఇంత ప్రేమ కురిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎంతమంది బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు కేటాయించింది..?
TELANGANA CONGRESS: తెలంగాణలో రోజు రోజుకూ కాంగ్రెస్ బలం పెరుగుతోంది. ఎవరు అవునన్నా.. కాదన్నా ఇది మాత్రం నిజం. వరుసగా పార్టీలో చేరికలు.. కొత్త కొత్త హామీలతో ప్రజల్లో ఆదరణ పెంచుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటి వరకూ పలు డిక్లరేషన్లు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. శుక్రవారం బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. కాంగ్రెస్ పుట్టిందే బీసీల కోసం అన్నట్టు హామీల వర్షం కురిపించింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏకంగా బీసీ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేస్తామని చెప్పింది.
Siddaramaiah: కేసీఆర్‌ను ఓడించేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారు: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య
వేల కోట్లు ఖర్చు చేసి బీసీల అభివృద్ధికి బాటలు వేస్తామంటూ హామీలు ఇచ్చింది. ఇప్పటిదాకా అంతా బాగానే ఉంది. బీసీల మీద ఇంత ప్రేమ కురిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎంతమంది బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు కేటాయించింది..? ఇప్పుడు ఇదే పాయింట్ పాట్టుకున్నారు కాంగ్రెస్ ప్రత్యర్థులు. మాటలు ఫ్రీ కాబట్టి ఎవరైనా.. ఎన్నైనా చెప్తారు. గెలిచిన తరువాత చూద్దాంలే అన్నట్టు గాలికి హామీలు ఇవ్వడం చాలా ఈజీ. హామీల సంగతి పక్కన పెడితే.. కాంగ్రెస్ పార్టీలోనే బీసీలకు ప్రాధాన్యం దక్కలేదు. అలాంటి పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత బీసీలకు మంచి చేస్తుంది అంటే ఎలా నమ్మలి అంటున్నారు. సొంత పార్టీలో బీసీలకు టికెట్లు ఇవ్వనివాళ్లు.. అధికారంలోకి వచ్చిన తరువాత బీసీలకు ఏం చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో మొత్తం 118 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తోంది. దాదాపు అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. అందులో పట్టుమని పాతిక మంది కూడా బీసీలు లేరు. తెలంగాణలో అత్యధికంగా ఉండేది బీసీలే.
ఆ లెక్కన చూస్తే అన్ని పార్టీల్లో కూడా బీసీ అభ్యర్థులే ఎక్కువ సంఖ్యలో ఉండాలి. కానీ సగం మంది కూడా లేరు. కాంగ్రెస్ పార్టీలో అయితే పరిస్థితి మరీ దారుణమంటున్నారు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు. బీసీలంటే కాంగ్రెస్‌కు ఎంత ప్రేమ ఉందో టికెట్ల కేటాయింపులోనే తెలిసిపోయిందని విమర్శిస్తున్నారు. పట్టుమని పాతిక సీట్లు కూడా బీసీలకు ఇవ్వని కాంగ్రెస్ పార్టీ.. బీసీలకు ఇవన్నీ చేస్తుంది అంటే నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరంటూ విమర్శిస్తున్నారు.