CONGRESS MP SEATS: టిక్కెట్ల కోసం కాంగ్రెస్‌లో కుమ్ములాట.. లిస్టు రెడీ అయ్యేదెప్పుడు..?
పెద్దపల్లి, చేవెళ్ళ, మల్కాజ్ గిరి, సికింద్రాబాద్, ఆదిలాబాద్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను దాదాపు ఖరారు చేసినట్టు చెబుతున్నా.. వీటిల్లోనూ అభ్యర్థుల ఎంపికపై అభ్యంతరాలు వస్తున్నాయి. భువనగిరి కోసం కోమటిరెడ్డి బ్రదర్స్ వర్సెస్ చామల కిరణ్ మధ్య పోటీ నడుస్తోంది.
CONGRESS MP SEATS: తెలంగాణ కాంగ్రెస్‌లో ఎంపీ సీట్ల పంచాయతీ నడుస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో ఒకరికి మించి కాంగ్రెస్ లీడర్లు టిక్కెట్ల కోసం పోటీ పడుతుండటంతో ఎటూ తేల్చుకోలేకపోతోంది కాంగ్రెస్ అధిష్టానం. ఇప్పటికే ఫస్ట్ లిస్టులో నాలుగు సీట్లకు అభ్యర్థుల ప్రకటించింది. ఇంకా 3 ఎంపీ సీట్లపై క్లారిటీ వచ్చినా.. 5 సీట్లపై పోటా పోటీ నడుస్తోంది. ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, భువనగిరి, హైదరాబాద్ సీట్లు పెండింగ్‌లో ఉన్నాయి. పెద్దపల్లి, చేవెళ్ళ, మల్కాజ్ గిరి, సికింద్రాబాద్, ఆదిలాబాద్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను దాదాపు ఖరారు చేసినట్టు చెబుతున్నా.. వీటిల్లోనూ అభ్యర్థుల ఎంపికపై అభ్యంతరాలు వస్తున్నాయి.
AP BJP SEATS: సీట్ల సంగతి తేల్చని బీజేపీ.. తల పట్టుకుంటున్న టీడీపీ, జనసేన
భువనగిరి కోసం కోమటిరెడ్డి బ్రదర్స్ వర్సెస్ చామల కిరణ్ మధ్య పోటీ నడుస్తోంది. తనకు సన్నిహితుడైన కిరణ్ కి టిక్కెట్ ఇప్పించుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. అయితే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన భార్య లక్ష్మికి ఆ సీటు ఇవ్వాలని అధిష్టానం దగ్గర పైరవీలు చేస్తున్నారు. సికింద్రాబాద్ సీటుపై దానం నాగేరందర్ వర్సెస్ బొంతు రామ్మోహన్ నడుస్తోంది. ఈ టిక్కెట్ కోసమే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కారు దిగి కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. ఇక రీసెంట్ గా జాయిన్ అయిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా సికింద్రాబాద్ ఎంపీ టిక్కెట్ కావాలంటున్నారు. నాగర్ కర్నూల్ కోసం మల్లు రవి వర్సెస్ సంపత్ మధ్య పంచాయతీ నడుస్తోంది. 30యేళ్ళుగా పార్టీని నమ్ముకొని ఉన్నా.. నాకు అన్యాయం చేయొద్దు అంటూ సోనియా గాంధీకి లెటర్ రాశారు AICC కార్యదర్శి సంపత్. నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో మాదిగలు ఎక్కువ.. మాల కులానికి చెందిన మల్లు రవికి టిక్కెట్ ఇవ్వడం కరెక్ట్ కాదంటున్నారు. అలాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమను తొక్కేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ సోనియా కంప్లయింట్ చేశారు సంపత్ కుమార్.
ఖమ్మం ఎంపీ సీటు కోసం మల్లు భట్టి విక్రమార్క భార్య నందిని, మంత్రి తుమ్మల కొడుకు యుగంధర్, పొంగులేటి సోదరుడు ప్రసాద రెడ్డి పోటీ పడుతున్నారు. వీళ్ళు కాకుండా కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు, కుసుమ కుమార్, వంకాయల పాటి రాజేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళు ఉన్నారు. పొంగులేటి బ్రదర్ కి టిక్కెట్ ఇచ్చే అవకాశాలున్నాయని పార్టీలో ప్రచారం జరుగుతోంది. అయితే మల్లు భట్టి విక్రమార్కను కూల్ చేసేందుకు.. ఖమ్మం టిక్కెట్ అడక్కుండా చేసేందుకే నాగర్ కర్నూల్ టిక్కెట్ ను అదే కుటుంబానికి చెందిన మల్లు రవికి ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈనెల 19న జరిగిన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సుదీర్ఘ భేటీలో తెలంగాణలో 6 నియోజకవర్గాలపై చర్చ జరిగింది. మొత్తం 7 స్థానాలకు ఒక్కో పేరును రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీ సిఫార్సు చేసింది. ఆ మీటింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. కానీ భువనగిరి సహా కొన్ని స్థానాలపై ఏకాభిప్రాయం కుదరలేదు. దాంతో తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ఇంకా ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. 2,3 రోజుల తర్వాతే తెలంగాణపై కాంగ్రెస్ ఎన్నికల కమిటీ భేటీ అవనుంది. శని లేదా సోమ వారం మిగతా ఎంపీ అభ్యర్థులు ఖరారయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.