Telangana Congress: తెలంగాణలో మరో ప్రశ్నాపత్రం లీక్.. మామూలు ర్యాగింగ్ కాదయ్యా ఇది..
బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అంటూ ఆ మధ్య పెళ్లి కార్డు రిలీజ్ చేసిన కాంగ్రెస్.. ఇప్పుడు మరో కొత్త ప్రచారం అందుకుంది. తెలంగాణలో క్వశ్చన్ పేపర్ లీక్‌ల అంశాన్ని హైలైట్ చేస్తూ.. బీఆర్ఎస్‌ను టార్గెట్ చేసింది కాంగ్రెస్. తెలంగాణ ఎన్నికల ప్రశ్నాపత్రం.. బుక్‌లెట్ నంబర్ కేసీఆర్ 420 అనే పేపర్‌ను ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
Telangana Congress: అవతలోడి బలం మీద కొట్టడం ఒకెత్తు.. బలహీనతల మీద దాడి చేయడం మరొక ఎత్తు. యుద్ధంలో వీటి మీదే విజయం ఆధారపడి ఉంటుంది. రాజకీయం తెలిసిన వాళ్లకు ఈ విషయాలు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తెలంగాణలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నికల వేళ ఇక్కడి రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. కాదేదీ కామెంట్లకు అనర్హం అన్నట్లుగా.. పార్టీలన్నీ ఒక్కో ఇష్యూ తెరమీదకు తీసుకువస్తున్నాయ్.
Digvijaya Singh: వైఎస్సార్ విజన్ వల్లే హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధి: దిగ్విజయ్ సింగ్
కర్ణాటకలో కాంగ్రెస్ చేసిందేమీ లేదు.. అవే హామీలు ఇక్కడ అమలు చేస్తాం అంటూ నాటకాలు ఆడుతుందని కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ ఆరోపణలు గుప్పిస్తుంటే.. బీఆర్ఎస్ పదేళ్ల హయాంలో జరిగిన తప్పులను, లోపాలను కాంగ్రెస్ ఎండగడుతోంది. కాకపోతే కాసింత సెటైరికల్‌గా! బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అంటూ ఆ మధ్య పెళ్లి కార్డు రిలీజ్ చేసిన కాంగ్రెస్.. ఇప్పుడు మరో కొత్త ప్రచారం అందుకుంది. తెలంగాణలో క్వశ్చన్ పేపర్ లీక్‌ల అంశాన్ని హైలైట్ చేస్తూ.. బీఆర్ఎస్‌ను టార్గెట్ చేసింది కాంగ్రెస్. తెలంగాణ ఎన్నికల ప్రశ్నాపత్రం.. బుక్‌లెట్ నంబర్ కేసీఆర్ 420 అనే పేపర్‌ను ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇందులో కాళేశ్వరం ప్రాజెక్టు, గ్రూప్ 1 పరీక్ష పేపర్ లీక్, దళితులకు మూడు ఎకరాల భూమి, ధరణి పోర్టల్, ఉద్యోగ నోటిఫికేషన్, నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్రూం ఇళ్లు, కేజీ టు పీజీ విద్య, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లపై ప్రశ్నలు ఉన్నాయ్.
బీఆర్ఎస్ పార్టీలో ఆదర్శ మహిళా నేతలు ఎవరూ అనే ప్రశ్నకు బదులిస్తూ.. ఏడో తరగతి పాసైన విద్యాశాఖ మంత్రి, లిక్కర్ కవిత అంటూ ఆప్షన్లు ఇచ్చారు. ఈ పేపర్ ఇప్పుడు లీక్ అయిందని కాంగ్రెస్ నేతలు సెటైర్లు గుప్పిస్తున్నారు. ఇక్కడితో ఆగారా అంటే.. ఈ పేపర్‌తో ఎగ్జామ్ కూడా నిర్వహించారు. ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీలో ఈ పరీక్ష నిర్వహించారు. ఏమైనా బీఆర్ఎస్‌ను టార్గెట్ చేయడంలో కాంగ్రెస్ సరికొత్త వ్యూహాలను తెరమీదకు తీసుకువస్తోంది. నిరుద్యోగులతో, కొత్త ఓటర్లతో కేటీఆర్ భేటీ అయిన కొద్దిరోజులకే ఇలా పేపర్ లీకేజీ అంశాన్ని హైలైట్ చేస్తూ.. కాంగ్రెస్ పరీక్ష నిర్వహించడం.. ఇప్పుడు టాక్ ఆఫ్ ది పాలిటిక్స్‌గా మారింది. మరి దీనికి కారు పార్టీ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందన్నది ఆసక్తికర పరిణామంగా కనిపిస్తోంది.