CONGRESS: కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితా సిద్ధం..
ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిర్వహించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియలో భారీ మొత్తంలో అప్లికేషన్స్ వచ్చాయి. వాటన్నింటినీ పరిశీలించిన స్క్రీనింగ్ కమిటీ.. ప్రతీ నియోజకవర్గంలో ముగ్గురు అభ్యర్థులను సెలెక్ట్ చేసిందట. వారిలో ఒకరిని ఫైనల్ చేసి టికెట్ కేటాయించబోతున్నట్టు సమాచారం.
CONGRESS: తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా సిద్ధమైంది. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న స్క్రీనింగ్ కమిటీ మీటింగ్ అనంతరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించే చాన్స్ ఉంది. ఫస్ట్ లిస్ట్‌లో 40 అభ్యర్థుల పేర్లను ప్రకటించే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు సమాచారం. ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిర్వహించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియలో భారీ మొత్తంలో అప్లికేషన్స్ వచ్చాయి. వాటన్నింటినీ పరిశీలించిన స్క్రీనింగ్ కమిటీ.. ప్రతీ నియోజకవర్గంలో ముగ్గురు అభ్యర్థులను సెలెక్ట్ చేసిందట.
వారిలో ఒకరిని ఫైనల్ చేసి టికెట్ కేటాయించబోతున్నట్టు సమాచారం. సాధారణంగానే కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు ఎక్కువగా ఉంటారు. దీంతో పాటు బీఆర్‌ఎస్‌లో అసంతృప్తిగా ఉన్న చాలా మంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో టికెట్లు కేటాయించడం కాంగ్రెస్ పార్టీకి కష్టంగా మారిందట. దీనికి తోడు ఇప్పటికే బీఆర్‌ఎస్ తన అభ్యర్థులను ప్రకటించింది. ఒకేసారి 115 మందిని ప్రకటించి అందరికీ షాకిచ్చింది. ఇప్పుడు వాళ్లకు తగ్గ పోటీ ఇచ్చే క్యాండిడేట్లను కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేయాల్సి ఉంటుంది. దాంతో పాటే పార్టీలో ఉన్న సీనియర్, జూనియర్ గొడవను, పార్టీ అంతర్గ విభేదాలను కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. వీటన్నింటినీ దాటుకుని ఓ వ్యక్తికి టికెట్ కేటాయించడం బిగ్ టాస్క్.
ప్రస్తతం ఈ టాస్క్ ఫినిష్ చేసి ఫస్ట్ లిస్ట్‌ను రెడీ చేసిందట టీపీసీసీ. సెప్టెంబర్ ఆఖరి వారంలో మొదటి లిస్ట్ ప్రకటించే చాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌ను ఢీ కొట్టేలా ఎలాంటి అభ్యర్థులను కాంగ్రెస్ బరిలోకి దింపబోతోందో చూడాలి మరి.