TELANGANA CONGRESS: కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్‌లోకి.. బండి సంజయ్ చెప్పిందే జరగబోతుందా..?
ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత రోజు.. కేసీఆర్ చిటికేస్తే కారెక్కి కూర్చుంటారని అన్నారు. ఎన్నికల కోసం మాత్రమే వాళ్లంతా కాంగ్రెస్ కండువా కప్పుకొని తిరుగుతున్నారని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు కారణం అవుతోంది.
TELANGANA CONGRESS: రాజకీయం ఇలానే చేయాలనేం లేదు. ఎలా అయినా చేయొచ్చు. కాబట్టే రాజకీయం అంటారేమో బహుశా! చరిత్ర పేజీలు తిరగేస్తే.. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప.. హీరోలు, విలన్లు కనిపించరు రాజకీయాల్లో! తెలంగాణ రాజకీయం ఇప్పుడు అదే ఎక్స్‌పీరియన్స్ చేయబోతుందా అంటే.. ఆ ఇద్దరి మాటలతో అలాంటి అనుమానాలే మొదలయ్యాయ్. ఆ మధ్య బండి సంజయ్ ఓ మాట అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంతా.. గెలిచాక బీఆర్ఎస్‌లోకే వస్తారని, ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత రోజు.. కేసీఆర్ చిటికేస్తే కారెక్కి కూర్చుంటారని అన్నారు. ఎన్నికల కోసం మాత్రమే వాళ్లంతా కాంగ్రెస్ కండువా కప్పుకొని తిరుగుతున్నారని బండి సంజయ్ (BANDI SANJAY) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు కారణం అవుతోంది.
TELANGANA ASSEMBLY ELECTIONS: తెలంగాణలో హంగ్!? సంచలనం రేపుతున్న ఏబీపీ ఓటర్ సర్వే..
పేర్లు చెప్పలేదు కానీ.. కాంగ్రెస్ (CONGRESS) లో కొంతమంది అభ్యర్థుల ఖర్చు కేసీఆరే (KCR) భరిస్తున్నారని బాంబ్ పేల్చారు. బీఆర్ఎస్‌కు ఎమ్మెల్యేలను సప్లయ్ చేసే ఏటీఎంలా కాంగ్రెస్ మారిందంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఇదే ఇప్పుడు కొత్త చర్చకు కారణం అవుతోంది. ఈ విషయంపై రచ్చ జరుగుతుండగానే.. ఓ చానెల్‌కు డిస్కషన్‌కు వెళ్లి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఇలాంటి బాంబే కొత్తగా పేల్చారు. ఈ ఎన్నికల్లో 59 స్థానాలు వస్తేనే.. ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో ఉంటారని.. 59 స్థానాలకు ఏ ఒక్క సీటు తగ్గినా.. పార్టీ నుంచి చాలామంది ఎమ్మెల్యేలు ఇతర పార్టీలోకి జంప్ అవుతారు అంటూ సంచలన కామెంట్స్ చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయ్. దీంతో కాంగ్రెస్ విషయంలో బండి సంజయ్ ఎప్పటి నుంచో చెప్తున్న విషయాలు నిజమేనని అంతా అనుకుంటున్నారు. కాంగ్రెస్ గెలిస్తే సీఎం తానే అని చెప్పుకుంటున్న కోమటిరెడ్డికే.. తమ పార్టీ ఎమ్మెల్యేల మీద నమ్మకం లేదు అంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు అంటూ చర్చ జరుగుతోంది.
Telangana Elections : నిన్న టీడీపీ.. ఇవాళ షర్మిల.. రెండు పార్టీల ఓటర్లు ఎటు వైపు..?
ఐతే ఈ ఇద్దరు అన్నారని కాదు కానీ.. కేసీఆర్ వ్యూహాలను అంచనా వేయడం అంత ఈజీ కాదు. తనే శత్రువును క్రియేట్ చేసి.. ఆ శత్రువును మరో శత్రువుతో కలిపి, ఆ ఇద్దరిని మిత్రులను చేసి.. రాజకీయం చేయగలరు. ఇలా చేయడం రాజకీయాల్లో మామూలే! రాజకీయాల్లో నియమాలు ఉండవ్, విజయాలు, వ్యూహాలు తప్ప! కాంగ్రెస్‌లో కొందరికి.. బీఆర్ఎస్ ఫండింగ్ చేస్తుందనే చర్చ ఎప్పటినుంచో వినిపిస్తోంది. ఇప్పుడు ఈ ఇద్దరి ద్వారా బయటకు వచ్చింది అంతే ! కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఎప్పుడూ రెండు పడవల ప్రయాణం చేస్తున్నట్లు కనిపిస్తారు. ఏ పార్టీ జోరు మీద ఉంటే.. ఆ పార్టీలోకి జంప్ అవుతారు. 2018 ఎన్నికల సమయంలో కనిపించింది అదే! ఇలాంటి పరిణామాల మధ్య.. అప్పుడు బండి సంజయ్, ఇప్పుడు కోమటిరెడ్డి మాటలతో.. కాంగ్రెస్‌లో గెలిచి బీఆర్ఎస్‌లోకి ఎమ్మెల్యేలు నిజంగా వెళ్తారా.. ఏం జరగబోతుంది అనే ఆసక్తి తెలంగాణ రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.