REVANTH REDDY: ఎంపీ అభ్యర్థుల ఎంపిక రేవంత్ చేతుల్లో.. కాంగ్రెస్ నుంచి పోటీ చేయబోయేది వీళ్లే..

కాంగ్రెస్ నుంచి చాలా మంది ఎంపీలుగా బరిలోకి దిగేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ జాబితాలో సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం పూర్తిగా రేవంత్ రెడ్డికే బాధ్యతలు అప్పగించిందని తెలుస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 19, 2023 | 06:15 PMLast Updated on: Dec 19, 2023 | 6:15 PM

Telangana Congress Mp Candidates Will Be Selected By Revanth Reddy

REVANTH REDDY: అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతమైన విజయంతో తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్.. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఇదే దూకుడు చూపించాలని ఫిక్స్ అయింది. లోక్‌సభ ఎన్నికలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. వచ్చే ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు దక్కించుకోవాలనే పట్టుదలతో కనిపిస్తోంది. ఎలాగూ తెలంగాణలో అధికారంలో ఉండడంతో.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఆ ఎఫెక్ట్ కనిపిస్తుందని.. కాంగ్రెస్ నుంచి చాలా మంది ఎంపీలుగా బరిలోకి దిగేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ జాబితాలో సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు.

T BJP: 12 ఎంపీ స్థానాలపై ఫోకస్‌ చేసిన బీజేపీ.. తెలంగాణలో ఎంపీ అభ్యర్థులు వీళ్లే..

ఐతే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా అధిష్టానం కనుసన్నల్లోనే జరుగుతుందని.. వారు సూచించిన వారికే ఎంపీ అభ్యర్థులుగా చాన్స్ దక్కుతుందని అంతా అనుకుంటుంటే.. ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం పూర్తిగా రేవంత్ రెడ్డికే బాధ్యతలు అప్పగించిందని తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపిక వ్యవహారం మొత్తం రేవంతే ఖరారు చేయాల్సిందిగా బాధ్యతలు అప్పగించారట. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ సీట్లు సాధించేలా అభ్యర్థుల ఎంపిక చేపట్టాలని సూచించినట్లుగా తెలుస్తోంది. ముందుగానే అభ్యర్థులను ఖరారు చేస్తే.. వాళ్లు జనాల్లోకి వెళ్లేందుకు అవకాశం ఏర్పడుతుందని ఒక అంచనాకు వచ్చారు. దీంతో అభ్యర్థుల ఎంపికపై రేవంత్ దృష్టి సారించారు. ఆయన సూచించిన అభ్యర్థుల జాబితానే ఏఐసీసీ అధికారికంగా ప్రకటించే చాన్స్ ఉంది. ఇక అటు 12 స్థానాల్లో ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై క్లారిటీకి వచ్చినట్లుగా తెలుస్తోంది. నల్గొండ స్థానం నుంచి సీనియర్ నేత జానారెడ్డి లేదా పటేల్ రమేష్ రెడ్డిలో ఒకరికి అవకాశం దక్కనుంది.

AYODHYA RAM TEMPLE: అయోధ్య రాముడికి భక్తుడి కానుక.. రాములోరి మెడలో 5 వేల వజ్రాల హారం..

మల్కాజ్‌గిరి నుంచి మైనంపల్లి హనుమంతరావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి పేరు కూడా ఇదే నియోజకవర్గం నుంచి వినిపిస్తోంది. ఖమ్మం సీటును పొత్తులో భాగంగా వామపక్షాలకు కేటాయించే అవకాశం ఉందని టాక్‌. అలా జరగకపోతే రేణుకా చౌదరి లేదా పొట్ల నాగేశ్వరావు పేర్లు పరిశీలనలో ఉన్నాయ్. పెద్దపల్లి నుంచి వివేక్ కుమారుడు వంశీ పేరు వినిపిస్తోంది. మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ లేదా విజయభాయిలలో ఒకరికి అవకాశం దక్కనుంది. వరంగల్ నుంచి సిరిసిల్ల రాజయ్య లేదా మంత్రి పదవి ఇవ్వకపోతే అద్దంకి దయాకర్.. ఇద్దరూ కాకపోతే దొమ్మాట సాంబయ్య పేర్లు వినిపిస్తున్నాయి. భువనగిరి నుంచి కోమటిరెడ్డి లక్ష్మి లేదా శ్యామల కిరణ్ రెడ్డిలో ఒకరికి టికెట్ ఇవ్వనుననారు. మహబూబ్‌నగర్‌ నుంచి వంశీచంద్ రెడ్డి లేదా సీతా దయాకర్‌ రెడ్డిలో ఒకరికి చాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. మెదక్ నుంచి విజయశాంతిని పోటీకి దింపనున్నారట. హైదరాబాద్ నుంచి అజారుద్దీన్ లేదా ఫిరోజ్ ఖాన్ పేర్లు పరిశీలనలో ఉన్నాయ్.

సికింద్రాబాద్ నుంచి అంజన్ కుమార్ యాదవ్ లేదా నవీన్ యాదవ్ పేర్లను పరిశీలిస్తున్నారు. నిజామాబాద్ నుంచి ధర్మపురి సంజయ్ లేదా జీవన్ రెడ్డిని పోటికి దింపనున్నారు. నాగర్ కర్నూల్ నుంచి మల్లు రవి.. చేవెళ్ల నుంచి కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి, కరీంనగర్ నుంచి అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, రోహిత్ రావు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఆదిలాబాద్ నుంచి నరేష్ జాదవ్ పేరును పరిశీలిస్తున్నారు.