T CONGRESS: బస్సు యాత్రలో రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ శ్రేణులకు జోష్..!
త్వరలో పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లేందుకు పార్టీ సిద్ధమవుతోంది. ఈ నెల నుంచే కాంగ్రెస్.. బస్సు యాత్రలు ప్రారంభించబోతుంది. కాంగ్రెస్ నేతలు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించబోతున్నారు. బస్సు యాత్రకు సంబంధించిన ఏర్పాట్లను పార్టీ శ్రేణులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నాయి. ఈ బస్స యాత్రలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొనబోతున్నారు.
T CONGRESS: తెలంగాణలో కాంగ్రెస్‌కు పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో అధిష్టానం పూర్తి దృష్టి సారించింది. గెలిచే అవకాశాల్ని సద్వినియోగం చేసుకుని, అధికారంలోకి రావాలని భావిస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికల బాధ్యతను కర్ణాటక ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్‌కు అప్పగించింది. త్వరలో పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లేందుకు పార్టీ సిద్ధమవుతోంది. ఈ నెల నుంచే కాంగ్రెస్.. బస్సు యాత్రలు ప్రారంభించబోతుంది. కాంగ్రెస్ నేతలు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించబోతున్నారు. బస్సు యాత్రకు సంబంధించిన ఏర్పాట్లను పార్టీ శ్రేణులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నాయి. ఈ బస్స యాత్రలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొనబోతున్నారు.
పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ నెల 16న రాహుల్ గాంధీ జెండా ఊపి బస్సు యాత్రను ప్రారంభిస్తారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క సహా తెలంగాణ కాంగ్రెస్ అగ్ర నేతలంతా ఈ యాత్రలో పాల్గొంటారు. తెలంగాణ వ్యాప్తంగా పర్యటించి, కాంగ్రెస్‌కు విస్తృత ప్రచారం కల్పిస్తారు. ప్రతి నియోజకవర్గాన్ని కవర్ చేసేలా ఈ యాత్ర సాగుతుంది. ఈ బస్సు యాత్ర ద్వారా పూర్తిస్థాయి ఎన్నికల సమరానికి కాంగ్రెస్ సిద్ధమైనట్లే. ఈ బస్సు యాత్రకు మరింత జోష్ తెచ్చేలా.. అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొనబోతున్నారు. ఈ నెల 19, 20, 21 తేదీల్లో బస్సు యాత్రలో రాహుల్ పాలుపంచుకుంటారు. ఆయన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ పార్టీ ఖరారు చేసింది. కీలకమైన అభ్యర్థుల ప్రకటన బస్సు యాత్రకు ముందే ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తైంది. కొన్ని నియోజకవర్గాలు మినహా చాలా వాటికి అభ్యర్థుల్ని దాదాపు ఖరారు చేశారు. మిగతా నియోజకవర్గాలపై కసరత్తు కొనసాగుతోంది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుదిదశకు చేరడంతో ఇకపై పూర్తిగా ప్రచారంపైనే కాంగ్రెస్ ఫోకస్ చేయనుంది.
సర్వేతో జోష్..
లోక్‌పాల్ అనే సంస్థ తెలంగాణలో నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్‌కు అనుకూల ఫలితాలు వెలువడ్డాయి. ఈ సర్వే ప్రకారం.. కాంగ్రెస్ పార్టీ 61 నుంచి 67 అసెంబ్లీ స్థానాలు గెలిచే ఛాన్స్ ఉంది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ 41 నుంచి 44 వరకు ఓట్ల శాతాన్ని నమోదు చేసుకుంటుందని ఈ సర్వేలో తేలింది. సర్వే ఇచ్చిన జోష్‌తో కాంగ్రెస్ పార్టీ మరింత ఉత్సాహంగా పని చేయబోతుంది.