TELANGANA CONGRESS: సూర్యాపేట, తుంగతుర్తి ఎవరికి.. కాంగ్రెస్‌లో ఆ 4 సీట్లు వారికేనా..
నాలుగు స్థానాల్లో టికెట్ల పంచాయితీ ఎటూ తేలడం లేదు. కాంగ్రెస్ పెండింగ్‌లో ఉంచిన నాలుగు స్థానాల్లో మిర్యాలగూడ, సూర్యాపేట, తుంగతుర్తి, చార్మినార్ ఉన్నాయి. ఇందులో సూర్యాపేట, తుంగతుర్తి, మిర్యాలగూడ కీలకంగా మారాయ్.

TELANGANA CONGRESS: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (ASSEMBLY ELECTIONS)కు నామినేషన్ల స్వీకరణ ముగింపు గడువు దగ్గరపడుతోంది. ఈ నెల 10తో గడువు ముగియనుంది. ఐనా కాంగ్రెస్ (CONGRESS)లో మాత్రం ఇప్పటికీ నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక పెండింగ్‌లోనే ఉంది. ఈ నాలుగు స్థానాల్లో టికెట్ల పంచాయితీ ఎటూ తేలడం లేదు. కాంగ్రెస్ పెండింగ్‌లో ఉంచిన నాలుగు స్థానాల్లో మిర్యాలగూడ, సూర్యాపేట, తుంగతుర్తి, చార్మినార్ ఉన్నాయి. ఇందులో సూర్యాపేట, తుంగతుర్తి, మిర్యాలగూడ కీలకంగా మారాయ్.
ASSEMBLY ELECTIONS: తెలంగాణలో హంగ్ వస్తే..! ఎన్నికల తర్వాత ఎవరు ఎవరితో..?
సీపీఎంతో పొత్తుపై చర్చలు జరుగుతుండటంతోనే మిర్యాలగూడను పెండింగ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ రానున్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే.. పార్టీ శ్రేణులతో భేటీ అవుతారు. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి సీపీఎంతో పొత్తుపై నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది. ఇక అటు సీపీఎంకు కాంగ్రెస్ రెండు ప్రతిపాదనలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. సీపీఐ తరహాలోనే మిర్యాలగూడ, రెండు ఎమ్మెల్సీలు సీపీఎంకు ఇచ్చే ప్రతిపాదనపై చర్చించే అవకాశం ఉంది. ఇదీ కుదరకపోతే.. మిర్యాలగూడ, ఒక ఎమ్మెల్సీ స్థానం, హైదరాబాద్‌లో మరో అసెంబ్లీ స్థానం కేటాయించేందుకు మొగ్గు చూపే చాన్స్ ఉంది. సీపీఎం రాష్ట్ర నేతలతో కాంగ్రెస్ పెద్దలు దీనికి సంబంధించి చర్చలు కూడా జరుపుతున్నారు. ఇక అటు సూర్యాపేట, తుంగతుర్తి అభ్యర్థుల ఎంపిక.. కాంగ్రెస్‌కు కత్తి మీద సాములా మారంది. తెలంగాణలో ఇప్పటివరకు మాదిగ, మాల సామాజికవర్గాలకు చెరో 9స్థానాలు కేటాయించారు. తుంగతుర్తి అసెంబ్లీ స్థానానికి మాదిగ సామాజికవర్గం అభ్యర్ధిని ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది.
PAWAN KALYAN: సన్నిహితుడికి షాక్ ఇచ్చిన పవన్.. టిక్కెట్ నిరాకరణ
మాల సామాజికవర్గంతో కంపేర్ చేస్తే.. మాదిగ వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకోనుంది. ఇక అటు సూర్యాపేట అభ్యర్థి ఖరారుపై సంప్రదింపులు కొనసాగుతున్నాయ్. సూర్యాపేట నుంచి పోటీ చేయడానికి రాంరెడ్డి దామోదర్ రెడ్డితో పాటు.. పటేల్ రమేష్ రెడ్డి ఆసక్తి చూపిస్తున్నారు. ఐతే తనకు చివరిసారిగా పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని సీనియర్ నేత దామోదర్ రెడ్డి.. అధిష్టానం ముందు విన్నపాలు పెట్టారు. దీంతో కాంగ్రెస్ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారింది.