రేవంత్, పుష్ప కొట్టుకుని సంధ్యను చంపేస్తారా…? తొక్కలో సినిమా, తొక్కలో ప్రీమియర్ షో, తొక్కలో గోల
సంధ్య థియేటర్ యాజామాన్యం విషయంలో తెలంగాణా సర్కార్ సీరియస్ గా ఉందా...? తమను కోర్ట్ లో ఇరికించిన యాజమాన్యాన్ని ఇబ్బంది పెట్టడానికి తెలంగాణా పోలీసులు రంగం సిద్దం చేస్తున్నారా...? బెయిల్ పై విడుదలై బయటకు వచ్చినా...
సంధ్య థియేటర్ యాజామాన్యం విషయంలో తెలంగాణా సర్కార్ సీరియస్ గా ఉందా…? తమను కోర్ట్ లో ఇరికించిన యాజమాన్యాన్ని ఇబ్బంది పెట్టడానికి తెలంగాణా పోలీసులు రంగం సిద్దం చేస్తున్నారా…? బెయిల్ పై విడుదలై బయటకు వచ్చినా… సంధ్యా ఓనర్స్ కు మనశ్శాంతి లేదా…? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళడం ఏమో గాని అక్కడి నుంచి సంధ్య థియేటర్ యాజమాన్యానికి నిద్ర లేని రాత్రులు మిగిలాయి. అసలు థియేటర్ ఎందుకు మెయింటేన్ చేస్తున్నామో అర్ధం కాని పరిస్థితి.
హీరో విలన్ కొట్టుకుని కమెడియన్ ను చంపేసినట్టు ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి సంధ్య థియేటర్ లైసెన్స్ రద్దు వరకు వచ్చింది పరిస్థితి. రేవతి మరణించినా… ఆమె ఆత్మ మాత్రం సంధ్య యాజమాన్యాన్ని వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే జైలుకు వెళ్లి వచ్చారు… ప్రీమియర్ షో వేసిన పాపానికి. పాపం పుణ్యం తెలియకపోయినా ప్రాయశ్చితం మాత్రం కామన్ అయింది సంధ్యకు. అక్కడ బల ప్రదర్శన చేసాడో… ఎవరికి ఏం చూపించాలి అనుకున్నాడో గాని పుష్ప 2 పేరుతో బన్నీ వచ్చేసాడు. ఎర్ర చందనం మాదిరి రేర్ పీస్ కాబట్టి జనాలు కూడా వచ్చేశారు.
జనాలకు ప్రతీ ఒక్కటి వెర్రి. ఆ వెర్రె ఒక మహిళ ప్రాణం తీసి… అసలు సంధ్య థియేటర్ లేకుండా చేసే వరకు వెళ్ళింది సీన్. లైసెన్స్ విషయంపై షోకాజ్ నోటీసులు జారీ చేసారు చిక్కడపల్లి పోలీసులు. లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. వారం రోజుల్లో వివరణ ఇవ్వకుంటే లైసెన్స్ రద్దు చేస్తామంటూ పోలీసులు హెచ్చరించడం గమనార్హం. అసలు ఇదంతా చూస్తుంటే… గొడవ… రేవతి చనిపోయినందుకా రేవంత్ ఇగోనా అనేది అర్ధం కాని పరిస్థితి జనాలకు.
ఇక పోలీసులకు రెండు రోజుల ముందే తాము సమాచారం ఇచ్చామని సంధ్యా థియేటర్ చెప్పే ప్రయత్నం చేసింది. ఆ చెప్పడం కూడా కోర్ట్ లో చెప్పింది. సాక్ష్యం కూడా ఉందని ఓ పేపర్ క్లిప్ ను బయట పెట్టారు. ఇక్కడే తెలంగాణా పోలీసుల ఇగో హర్ట్ అయింది. అది పోలీసుల ఇగోనా లేక పెద్దోళ్ళ ఇగోనా అనేది అర్ధం కావడం లేదు. ఇప్పుడెమో… మీకు ముందే చెప్పాం… మాకు రెండు రోజుల ముందు చెప్తే మేం వారం రోజుల ముందు చెప్పాం అంటూ పోలీసులు అంటున్నారు. సిఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ చూస్తే బన్నీ విషయంలో ఎక్కడో తేడాగా ఉంది, కోపం ఉంది… ఆ కోపానికి సంధ్యా థియేటర్ కాల గర్భంలో కలిసిపోయే సీన్ క్లియర్ గా కనపడుతోంది. ఇదంతా చూస్తుంటే… పుష్పలో డైలాగ్ చెప్పినట్టు… తొక్కలో సినిమా, తొక్కలో ప్రీమియర్ షో, తొక్కలో గోల మాదిరి ఉంది. మరి వారం రోజుల్లో పోలీసులకు ఏం సమాధానం ఇస్తారో… అసలు కోర్ట్ కే వెళ్తారో చూడాలి.