బ్రేకింగ్: మద్యం ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం షాక్ ?
మద్యం ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి షాకివ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే బీర్ల రేట్లు పెంచిన ప్రభుత్వం ఇప్పుడు లిక్కర్ ధరలు కూడా పెంచే యోచనలో ఉన్నట్టు సమాచారం.

మద్యం ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి షాకివ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే బీర్ల రేట్లు పెంచిన ప్రభుత్వం ఇప్పుడు లిక్కర్ ధరలు కూడా పెంచే యోచనలో ఉన్నట్టు సమాచారం. చీప్ లిక్కర్ మినహా మిగతా బ్రాండ్ల మీద ధరలు పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.
5 వందల కంటే ఎక్కువ ధర ఉన్న బాటిళ్ల మీద 10 శాతం రేట్లు పెరగబోతున్నట్టు టాక్. దీని ప్రకారం ప్రతీ బ్రాండ్ బాటిల్ మీద 50 రూపాయలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. ఆయా బాటిళ్ల ఎమ్మార్పీ ఆధారంగా రేట్లు పెరగనున్నాయి. అధికారులతో సమీక్షించిన అనంతరం ధరల పెంపుపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.