ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన డైలాగ్…విన్నారు కదా. తాను ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం రాష్ట్రంలో బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చేది లేదని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఇందులో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. పుష్ప-2 సినిమా ఇష్యూ సందర్భంగా రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎంకు మంత్రులు జత కలిశారు. పుష్ప సినిమా ఇష్యూలో అల్లు అర్జున్ జైల్ కు వెళ్ళివచ్చారు. కేసు నడుస్తూనే వుంది. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ సందర్భంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. మంత్రులు అందరూ మూకుమ్మడిగా బెనిఫిట్ షోలు రద్దును సమర్థించారు. ఇక్కడి వరకు కథ బాగానే ఉంది. సీన్ కట్ చేస్తే ప్రొడ్యూసర్, తెలంగాణ ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు దిల్ రాజు ఎంట్రీ ఇచ్చారు. దెబ్బకు మొత్తం మారిపోయింది. ఇండస్ట్రీ ప్రముఖులను సీఎం వద్దకు తీసుకెళ్లారు. కలిశారు….ఇండస్ట్రీకి సహకారం పై చర్చించారు. అక్కడితో ఆ టాపిక్ ముగిసింది. సంక్రాంతి పండగ సందర్భంగా దిల్ రాజు నిర్మించిన రెండు భారీ బడ్జెట్ సినిమాలు విడుదల అవుతున్నాయి. అందులో ఒకటి రాంచరణ్ నటించిన గేమ్ చేంజర్. దాదాపు 3 వందల కోట్లు పెట్టి సినిమాను తెరకెక్కించారు. పెట్టిన పెట్టుబడి రావాలంటే టికెట్ రేట్లు పెంచాలి. లేదంటే బెనిఫిట్ షోలకి అనుమతి ఇవ్వాలి. ఇక్కడే తెలంగాణ ప్రభుత్వం చాకచక్యంగా వ్యవహరించింది. బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకుండా టికెట్ రేట్లను పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం మూవీలకు టికెట్ ధరలు పెంపునకు ఒకే చెప్పింది. దీంతో తెలంగాణ అంతటా కొత్త చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పింది ఏంటి…చేస్తున్నది ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. సినిమా టికెట్ ధరలు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఆ రెండు సినిమాల ప్రొడ్యూసర్ దిల్ రాజు అలియాస్ వెంకటరమణారెడ్డి కావడం తోనే టికెట్ ధరలు పెంచారని మండిపడుతున్నారు. ఇద్దరు ఒకే కులం కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని చర్చ నడుస్తోంది. మరోవైపు దిల్ రాజు ఏం మాయ చేశాడు… సూట్ కేసులు ఇచ్చాడా? రేవంత్ రెడ్డిని తెలంగాణ మంత్రులను కొనేశాడా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు లొంగిపోయాడు. దిల్ రాజు ఏం చెప్పాడు అన్నది హాట్ టాపిక్ గా మారింది. రేపటి నుంచి 9 రోజులు పాటు ప్రతిరోజు ప్రత్యేక షోలకు పర్మిషన్ ఇచ్చింది. 10,11 తేదీల్లో మల్టీఫ్లెక్స్ థియేటర్లలో టికెట్ పై అదనంగా 150, సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ పై వంద రూపాయలు పెంచింది. 12 తేదీ నుంచి ప్రతి రోజు 5 షోలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ రోజుల్లో మల్టీఫ్లెక్స్ ల్లో అదనంగా వంద, సింగిల్ స్క్రీన్ లల్లో 50 రూపాయలు పెంచుకునేందుకు జీఓ పాస్ చేసింది. అయితే సినిమాల విషయంలో అంత రచ్చ చేసిన రేవంత్ రెడ్డి…తాజా నిర్ణయం పై జనం మండిపడుతున్నారు. తెర వెనక ఏం జరిగిందో తెలియదు కానీ…ఇంతలోనే అంత మార్పా…. క్యాస్ట్ ఈక్వేషన్ పనిచేసిందా లేదంటే డబ్బు చేతులు మారిందా? పవన్ కళ్యాణ్, చిరంజీవి కోసం కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుందా? ఇంకా చెప్పాలంటే దిల్ రాజు కోసమా అన్నది మిస్టరీగా మారింది. అసలు బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చేది లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఇది చెప్పి 20 రోజులు కూడా కాలేదు. సర్కార్ మాట మీద నిలబడదా? మాట చెప్పడం కాంగ్రెసుకు అలవాటేనా? అలాంటప్పుడు సొల్లు కబుర్లు చెప్పడం ఎందుకు? తర్వాత ఇండస్ట్రీకి బెండు అవడం ఎందుకు అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఏ పార్టీ అయినా సరే…ఎంతటి రాజకీయ నాయకుడైనా సరే ఇండస్ట్రీ కి లొంగాల్సిందేనన్న చర్చ సాగుతోంది. టికెట్ రేట్ల విషయంలోను ఆచితూచి వ్యవహరిస్తామని కోమటిరెడ్డి స్పష్టం చేసారు. దిల్ రాజు సినిమాల విషయంలో మాత్రం మాట మార్చారు…కాదు కాదు మాట తప్పారు. వాళ్లు రూల్స్ మాత్రమే పెడతారని పాటించరని సెటైర్లు వేస్తున్నారు. భారీగా డబ్బులు చేతులు మారకపోతే ఇండస్ట్రీకి అనుకూలంగా ఎందుకు తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీ లో అంతన్నాడు…ఇంతన్నాడు లింగరాజు అంటూ జోకులు వేస్తున్నారు. మనీ పని చేసిందా లేదంటే మగువ తో ప్రభుత్వాన్ని లొంగదీసుకున్నారా? ఈ రెండు కానప్పుడు దిల్ రాజు క్యాస్ట్ పనిచేసిందా? సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి, గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం మూవీ ప్రొడ్యూసర్ దిల్ రాజు అలియాస్ వెంకటరమణారెడ్డి…ముగ్గురిది ఒకటే క్యాస్ట్….అందుకే వర్కౌట్ అయిందా అన్నది అంతుచిక్కడం లేదు[embed]https://www.youtube.com/watch?v=SwNDBBroJP0[/embed]