మొన్నే చెప్పాం చూసుకో, పాల్ కు హైకోర్ట్ షాక్…!

కేఏ పాల్‌ దాఖలు చేసిన మధ్యంతర పిటీషన్‌ను హైకోర్టు కొట్టేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకుండా ఆదేశించాలన్న కేఏ పాల్ పిటీషన్ ను కోర్ట్ కొట్టేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 28, 2024 | 04:54 PMLast Updated on: Nov 28, 2024 | 4:54 PM

Telangana High Court Shock To Ka Paul

కేఏ పాల్‌ దాఖలు చేసిన మధ్యంతర పిటీషన్‌ను హైకోర్టు కొట్టేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకుండా ఆదేశించాలన్న కేఏ పాల్ పిటీషన్ ను కోర్ట్ కొట్టేసింది. అసెంబ్లీ నిర్ణయాల్లో జోక్యం చేసుకోకుండా, తీర్మానాల్లో ఓటు వేయకుండా ఆదేశించాలని కేఏ పాల్ కోర్ట్ ను కోరారు. దానం నాగేందర్ గత పదేళ్లలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ మారుతూ వస్తున్నారన్న కేఏ పాల్… ప్రజలు ఎన్నుకొన్న ఎమ్మెల్యేలు ఇలా పార్టీ మారితే ప్రజాస్వామ్యంపై నమ్మకం పోతుందని పిటీషన్ లో పేర్కొన్నారు.

వాళ్ళపై చర్యలు తీసుకోపోతే ఎమ్మెల్యేలు పార్టీ మారడం సహజమైపోతుందని కోర్ట్ దృష్టికి తీసుకు వెళ్ళారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నిర్ణయం స్పీకర్ పరిధిలో ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని ఇటీవలి తీర్పులో వెలువరించామని హైకోర్ట్ పేర్కొంది. స్పీకర్ నిర్ణయం తీసుకోకముందే ఆ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి వెళ్లకుండా ఆదేశించలేమని స్పష్టం చేసింది.