ఏపీలో అడుగుపెట్టిన అమ్రాపాలి
ఎట్టకేలకు తెలంగాణా ఐఏఎస్ అధికారులు ఏపీలో రిపోర్ట్ చేసారు. డీఓపిటి ఆదేశాల మేరకు ఏపి లో నలుగురు ఐఏఎస్ అధికారులు రిపోర్ట్ చేసారు. ఏపి సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ కు ఆమ్రపాలి , రోనాల్డ్ రోస్, వాకాటి అరుణ, వాణి ప్రసాద్ రిపోర్ట్ చేసారు.

ఎట్టకేలకు తెలంగాణా ఐఏఎస్ అధికారులు ఏపీలో రిపోర్ట్ చేసారు. డీఓపిటి ఆదేశాల మేరకు ఏపి లో నలుగురు ఐఏఎస్ అధికారులు రిపోర్ట్ చేసారు. ఏపి సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ కు ఆమ్రపాలి , రోనాల్డ్ రోస్, వాకాటి అరుణ, వాణి ప్రసాద్ రిపోర్ట్ చేసారు. డీఓపీటీ ఆదేశాలపై జోక్యం చేసుకునేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించడం తో ఏపి కి వచ్చారు నలుగురు అధికారులు.
కాగా నిన్న హైకోర్ట్ లో ఐఏఎస్ ల అంశంపై విచారణ జరగగా కోర్టు ఘాటుగా స్పందించింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకుంటే ఈ సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదని అన్నారు. అందుకే తాము జోక్యం చేసుకోవడం లేదు అని… ముందు ఏపీలో రిపోర్ట్ చేయాలని తర్వాత ఏమైనా సమస్యలు ఉంటే వింటామని హైకోర్ట్ పేర్కొంది. వాస్తవానికి అధికారులు నిన్ననే రిపోర్ట్ చేయాల్సి ఉన్నా కోర్ట్ విచారణ కారణంగా వాయిదా పడింది.