Telangana: ఆంధ్రవాళ్లను తిట్టి బతకడమే నీతి.. బీఆర్ఎస్ నేతల్లారా ఇంత బిల్డప్ అవసరమా?

వైసీపీ వర్సెస్ టీడీపీ అక్కడ.. బీజేపీ వర్సెస్ బీజేపీ ఇక్కడ.. సరిగ్గా గమనించడం.. అలాంటి పంచాయితీలు కనిపించడం లేదు రెండురోజులుగా ! బీఆర్ఎస్‌, వైసీపీ మధ్యే యుద్ధం జరుగుతోందిప్పుడు ! మేము గొప్ప అని చెప్పుకోవడం వేరు.. అవతలి వాళ్లు వెధవలు అని చెప్పడం వేరు. మొదటి మాటలో పరిణతి కనిపిస్తుంది.. రెండో మాటలో స్వార్థం వినిపిస్తుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 13, 2023 | 09:15 PMLast Updated on: Apr 13, 2023 | 9:15 PM

Telangana Leaders Politics With Ap Leaders

బీఆర్ఎస్ నేతల మాటలు ఇప్పుడు సెకండ్‌ స్టేజ్‌కు సంబంధించినవే ! అప్పుడు టీఆర్ఎస్ అయినా.. ఇప్పుడు బీఆర్ఎస్ అయినా.. గులాబీ పార్టీకి తెలిసింది ఒక్కటే.. అదే ప్రాంతీయ అభిమానాన్ని రెచ్చగొట్టడం. ఆంధ్రోడు ఎవడైనా ఆంధ్రోడే.. ఆంధ్రావాళ్లు అంతా శత్రువులే అన్నట్లు ఉద్యమ సమయంలో కేసీఆర్ మాట్లాడినా.. ఏపీలో ఏముంది అభివృద్ది అంటే మాది అని ఇప్పుడు గులాబీ పార్టీ నేతలు అన్నా.. వినిపించేది, అనిపించేది అదే ! బీఆర్ఎస్‌ నీతి మారినట్లు ఏ మాత్రం అనిపించడం లేదు. అప్పుడు ఇప్పుడు వాళ్లకు తెలిసింది ఒక్కటే.. అదే ఆంధ్రావాళ్లను తిట్టడం. అక్కడి వాళ్లను తిట్టి ఇక్కడ బతకడం. ప్రతీసారి ఇదే వ్యూహంగా కనిపిస్తోంది.

బీఆర్ఎస్ పార్టీల నేతల మాటలు ఎలా ఉన్నా.. ఇప్పుడు రెండు రాష్ట్రాల ఆర్థిక స్థితిని బేరీజు వేసుకుంటున్నారు సామాన్య జనం. ఎందుకు ఏపీని వదులుకోవాలని పాయింట్ వైజ్‌గా ప్రశ్నిస్తున్న పరిస్థితి. తెలంగాణలో అసలు పేదరికమే లేనట్లు.. ప్రతీ ఇల్లు కోట్ల రపాయల సంపదతో కళకళ్లాడుతున్నట్లు బీఆర్ఎస్ నేతలు బిల్డప్ ఇస్తున్నారు. నిజంగా ఆ పరిస్థితి ఉందా.. అంత సీన్ లేదు. హైదరాబాద్ ఔట్‌స్కర్ట్స్‌ దాటి ఓ పది కిలోమీటర్లు పోతే తెలుస్తుంది అసలు సీన్ ఏంటో ! భూముల రేట్లు పెరిగాయ్ అని సంబరపడడం వరకు అంతా బాగానే ఉంది.. అసలు భూముల్లేని వారికి ఎంత భూమి ఇచ్చారన్నది ఇప్పుడు ఏపీ ప్రభుత్వం మద్దతుదారుల నుంచి వినిపిస్తున్న ప్రశ్న.

ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మించారు నిజమే ! ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు జరిగిన ఎనిమిదేళ్లలో ప్రతీ ఎకరానికి నీళ్లు ఇచ్చారు.. అదీ నిజమే.. మరి మిగతా విషయాల సంగతి ఏంటన్నదే వారు నిలదీస్తున్న విషయం. మిగులు బడ్జెట్‌తో ఏర్పాటైన రాష్ట్రానికి అప్పులు పెరిగిపోయాయ్. ఉద్యోగాలు లేవ్‌. తలసరి ఆదాయం పెరగడం లేదు. అయినా సరే ఇంకా ధనిక రాష్ట్రం అన్న బిల్డప్ మాత్రం తగ్గడం లేదు. కేసీఆర్‌, కేటీఆర్, హరీష్‌, కవిత.. అందరిదీ అదే బిల్డప్‌.. తెలంగాణ అంతా సిరిసంపదలతో పొంగిపోతోందని ! నిజంగా అదే జరిగితే.. రాష్ట్రంలో వ్యతిరేకత అనేది ఈ స్థాయిలో ఉండకుండా ఉండాలి కదా.. బీజేపీ స్ట్రాంగ్ అవకుండా ఉండాలి కదా అన్నది వారు సంధిస్తున్న ప్రశ్న.

గీత పక్కన పెద్ద గీత గీసే ప్రయత్నం ఇదంతా ! ఆ గీత మరింత ప్రకాశవంతంగా కనిపించేందుకే ఈ బిల్డప్ అంతా ! పక్క రాష్ట్రాన్ని నిందించడం ద్వారా.. ఇక్కడ ఎస్టాబ్లిష్ కావాలనుకునే ప్రయత్నమే ఇది అన్నది చాలామంది నుంచి వినిపిస్తున్న అభిప్రాయం. పరనింద, ఆత్మస్తుతి ఇప్పుడు బీఆర్ఎస్ ఇదే నమ్ముకుందన్న చర్చ జరుగుతోంది రాజకీయవర్గాల్లో !