Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌పై మంత్రి కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంచి మిత్రుడని.. అన్నలాంటి వాడంటూ చెప్పారు. అనేక సార్లు చాలా విషయాలు ఇద్దరం కలిసి చర్చించామంటూ చెప్పారు. చాలా విషయాల్లో ఇద్దరి అభిప్రాయాలు కలిశాయని అందుకే తక్కువ టైంలోనే మంచి స్నేహితులుగా మారామన్నారు.

Pawan Kalyan: ఏపీ రాజకీయాలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంచి మిత్రుడని.. అన్నలాంటి వాడంటూ చెప్పారు. అనేక సార్లు చాలా విషయాలు ఇద్దరం కలిసి చర్చించామంటూ చెప్పారు. చాలా విషయాల్లో ఇద్దరి అభిప్రాయాలు కలిశాయని అందుకే తక్కువ టైంలోనే మంచి స్నేహితులుగా మారామన్నారు.
అయితే రాజకీయాల విషయంలో మాత్రం ఎవరికి వారే అన్నట్టుగా ఉంటామంటూ కేటీఆర్ చెప్పారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఏపీలో కూడా బీఆర్‌ఎస్ పోటీ చేస్తుందని చెప్పారు. ప్రస్తుతం ఏపీలో ఉన్న అన్ని పార్టీలు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాయని, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడగలిగే ఏకైక పార్టీ బీఆర్‌ఎస్ మాత్రమేనని, ఏపీ ప్రజలు ఆదరిస్తే ఏదైనా జరగొచ్చని చెప్పారు. తమ అపోనెంట్ బీజేపీ తప్ప వేరెవరూ కాదన్నారు మంత్రి కేటీఆర్. తనకు లోకేష్, వైఎస్ జగన్ కూడా మంచి మిత్రులంటూ చెప్పారు. ఆ రెండు పార్టీలతో తమకు వచ్చిన సమస్య ఏదీ లేదని.. కానీ ప్రస్తుతం వాళ్లిద్దరూ బీజేపీతో సన్నిహితంగానే ఉన్నారంటూ చెప్పారు. ఏపీలో ఏ పార్టీ బీజేపీని ప్రశ్నించే స్థాయిలో లేదంటూ చెప్పారు.
కేసీఆర్‌కు తప్ప అది ఎవరికి సాధ్యం కాదని, కేసీఆర్ లాంటి ఫైటర్‌ను ప్రజలు ఎప్పుడూ వదులుకోరని చెప్పారు. ఏపీలో ఎవరితో పొత్తు పెట్టుకోకుండా ఎన్నికలకు ఒంటరిగా వెళ్లేందుకు నిర్ణయించుకున్నామని చెప్పారు. పవన్ కళ్యాణ్ గురించి కేటీఆర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. ఏపీలో జనసేనతో కలిసి పోటీ చేయాలంటూ పవన్ కళ్యాన్ అభిమానులు, జనసైనికులు కామెంట్ చేస్తున్నారు.