రేవంత్ నే ఎదిరిస్తావా…? సుప్రీం కోర్ట్ లో సంచలన సాక్ష్యాలతో తెలంగాణా పోలీసులు
తెలంగాణతో పాటుగా దేశవ్యాప్తంగా సంధ్యా థియేటర్ ఘటన వ్యవహారం పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది. ఈ ఘటనలో సినీ హీరో అల్లు అర్జున్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది.
తెలంగాణతో పాటుగా దేశవ్యాప్తంగా సంధ్యా థియేటర్ ఘటన వ్యవహారం పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది. ఈ ఘటనలో సినీ హీరో అల్లు అర్జున్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. శనివారం శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ తర్వాత అదే రోజు సాయంత్రం అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి… అసలు తన వద్దకు ఏ పోలీస్ అధికారి రాలేదని తనకు ఆ విషయం తెలియదని తర్వాతి రోజు ఉదయం తెలిసిందని… అప్పుడు తాను బాధపడ్డాను అంటూ చెప్పుకొచ్చాడు.
ఈ ఘటన తర్వాత అసలు తాను ఇంట్లో నుంచి బయటకు కూడా వెళ్లలేదని… సక్సెస్ మీట్ లు కూడా చేయలేదంటూ కామెంట్స్ చేశాడు. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు దీనికి సంబంధించిన కీలక ఆధారాలను కూడా బయటపెట్టారు. మీడియా సమావేశంలో దీనికి సంబంధించిన వీడియోలను రిలీజ్ చేశారు. ఇక తాజాగా ఏసీపీ రమేష్ కుమార్ ఈ ఘటనపై కీలక వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ వద్దకు తాను వెళ్లాను అని… అతని మేనేజర్ సంతోష్ కు చెప్పానని రేవతి మరణం… శ్రీతెజ్ పరిస్థితి గురించి వివరించా అని ఆయన మీడియా సమావేశంలో పలు ఆసక్తి కామెంట్స్ చేశారు.
కానీ ఆ విషయాన్ని తానే అల్లు అర్జున్ కు చెప్తానని సంతోష్ చెప్పారని… కానీ చాలా సేపటి వరకు స్పందన లేకపోవడంతో డిసిపి ఆదేశంతో నేనే నేరుగా అల్లు అర్జున్ వద్దకు వెళ్లానని ఏసీపీ వివరించారు. మహిళ చనిపోయారని బాలుడు ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో ఉన్నాడని అల్లు అర్జున్ వివరించానని అయితే సినిమా చూశాకే వెళ్తానని అల్లు అర్జున్ బదులిచ్చినట్టు ఏసిపి తెలిపారు. ఇదే విషయం డిసిపి కి చెప్పానని ఆ తర్వాత డిసిపి తాను కలిసి అల్లు అర్జున్ వద్దకు వెళ్లి ఆయనను బయటకు తీసుకొచ్చామని సంచలన వ్యాఖ్యలు చేసారు.
ఈ సందర్భంగా డిసిపి, ఏసీపీ కలిసి అల్లు అర్జున్ ను బయటకు తీసుకు వెళుతున్న వీడియోను కూడా ఆయన బయటపెట్టారు. దీనితో ఇప్పుడు ఈ వీడియోల ఆధారంగా తెలంగాణ హైకోర్టులో బెయిల్ రద్దు పిటిషన్ వేసే అవకాశం కనబడుతోంది. అలాగే అవసరమైతే ఈ వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా వెళ్లేందుకు తెలంగాణ పోలీసులు రెడీ అవుతున్నారు. తమను అల్లు అర్జున్ పదేపదే దోషులుగా చూపించడంతో పోలీసులు ఆధారాలతో సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ బెయిల్ రద్దుకు ఇప్పుడు పోలీసులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే డీజీపీ కూడా ఈ విషయానికి సంబంధించి పోలీసులకు పూర్తి ఆదేశాలు ఇచ్చారట. అటు రేవంత్ రెడ్డి కూడా సీరియస్ గా ఉండటంతో పోలీసు వర్గాలు ఈ విషయంలో వేగంగా అడుగులు వేస్తున్నాయి.