బిజేపిలోకి తెలంగాణా స్టార్ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్… అక్కడి నుంచి ఎంపీగా ఛాన్స్

తెలంగాణలో బలపడుతున్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ప్రముఖ వ్యక్తులను పార్టీలోకి ఆహ్వానించే ప్లాన్ చేస్తుంది. సినీ అలాగే క్రీడా ప్రముఖులకు తమ పార్టీలో ప్రాధాన్యత ఇచ్చే దిశగా నిర్ణయాలు తీసుకుంటుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 28, 2024 | 01:59 PMLast Updated on: Dec 28, 2024 | 1:59 PM

Telangana Star Cricketer Vvs Laxman Joins Bjp Chance To Become Mp From There

తెలంగాణలో బలపడుతున్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ప్రముఖ వ్యక్తులను పార్టీలోకి ఆహ్వానించే ప్లాన్ చేస్తుంది. సినీ అలాగే క్రీడా ప్రముఖులకు తమ పార్టీలో ప్రాధాన్యత ఇచ్చే దిశగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఇక పార్టీలో ఉన్న అగ్ర నేతలకు కూడా తెలంగాణలో పెద్దపేట వేసేందుకు బిజెపి అధిష్టానం సిద్ధమైంది. ఇప్పటికే బీజేపీ కీలక నేత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని జాతీయ అధ్యక్షుడిగా నియమించేందుకు అమిత్ షా సిద్ధమయ్యారు. ఇక త్వరలోనే తెలంగాణలో ఆ పార్టీలో కీలక చేరికలు ఉండే అవకాశం ఉంది.

మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ ను బిజెపిలోకి ఆహ్వానిస్తున్నారు హోం మంత్రి అమిత్ షా. 2020లోనే ఆయనను బిజెపిలోకి తీసుకోవాలని భావించిన కొన్ని కారణాలతో వివిఎస్ లక్ష్మణ్ రాలేదు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం అలాగే ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువగా ఉండటంతో ఆయనకు అవకాశం కల్పించేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి ఆయనకు ఎంపీ సీటు ఇవ్వటానికి కూడా బిజెపి అధిష్టానం సిద్ధమైంది. ఉత్తరాది రాష్ట్రాల్లో క్రమంగా ఇబ్బంది పడుతున్న బిజెపి దక్షిణాది రాష్ట్రాల్లో బాగా వేసేందుకు ఉన్న అన్ని అవకాశాలను వాడుకుంటుంది.

ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి ఇబ్బందులు లేకపోవడంతో తెలంగాణలో ఆ పార్టీ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటుంది. కర్ణాటకలో కూడా క్రమంగా బిజెపి బలహీనపడటం ఆ పార్టీకి మింగుడు పడటం లేదు. ఈ తరుణంలో ప్రజాదరణ ఉన్నవాళ్లను అలాగే ప్రముఖ వ్యక్తులను పార్టీలోకి తీసుకుంటే కచ్చితంగా కలిసి వస్తుందని బిజెపి అంచనా వేస్తోంది. ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రముఖ సినీనటులను బిజెపిలోకి తీసుకుని వాళ్లకు మంచి ప్రాధాన్యత కల్పించారు. వీవీఎస్ లక్ష్మణ్ కు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది.

కర్ణాటకలో కూడా ఆయనకు అభిమానులు ఉన్నారు. క్రికెట్లో సుదీర్ఘకాలం పాటు రాణించిన లక్ష్మణ్ రాజకీయాలపై ఆసక్తిగా ఉన్నారని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. కానీ వాటిని ఇప్పటివరకు ఎక్కడా కూడా లక్ష్మణ్ ఖండించలేదు ధ్రువీకరించలేదు. అయితే బిజెపి అధిష్టానంతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్న నేపథ్యంలో పార్టీలోకి తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కు బిజెపి మంచి ప్రాధాన్య ఇచ్చింది. ఆయనకు ఢిల్లీ నుంచి ఎంపీ సీట్ కూడా ఇచ్చారు. 2019 ఎన్నికల్లో బిజెపి ఎంపీగా గౌతమ్ గంభీర్ విజయం సాధించాడు. అటు కర్ణాటకలో కూడా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లేపై బిజెపి ఫోకస్ పెట్టింది ఆయనను పార్టీలోకి తీసుకుని కీలక పదవి ఇవ్వాలని బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్లాన్ చేసిన కుంబ్లే మాత్రం అందుకు అంగీకారం తెలపలేదు.