PM MODI: మోదీపై నిరసన.. మోదీ సభలో యువతి టవర్ ఎక్కడానికి అసలు కారణం ఇదే..
సభలో మోదీ ప్రసంగం జరుగుతుండగా ఓ యువతి టవర్ ఎక్కి నిరసన తెలిపింది. ప్రధాని ఆ యువతిని గమనించి కిందకి దిగాలని సూచించారు. కానీ యువతి మాత్రం పైపైకి ఎక్కుతూ తన నిరసన వ్యక్తం చేసింది.

PM MODI: నవంబర్ 11న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో మాదిగల ఆత్మగౌరవ సభ నిర్వహించారు. ఈ సభకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభలో మోదీ ప్రసంగం జరుగుతుండగా ఓ యువతి టవర్ ఎక్కి నిరసన తెలిపింది. ప్రధాని ఆ యువతిని గమనించి కిందకి దిగాలని సూచించారు. కానీ యువతి మాత్రం పైపైకి ఎక్కుతూ తన నిరసన వ్యక్తం చేసింది.
ROHIT SHARMA: ఓపెనర్‌గా 14 వేలకుపైగా రన్స్.. రోహిత్ శర్మ మరో రికార్డు
కాసేపటికి పోలీసులు యువతిని సురక్షితంగా కిందకి దించారు. కిందకు వచ్చిన తరువాత అసలు తాను ఎందుకు నిరసన తెలిపిందో చెప్పింది ఆ యువతి. దేశంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా తాను ఈ పని చేసినట్టు తెలిపింది. దేశంలో మాదిగలు మాత్రమే లేరని, అలాంటప్పుడు ఆ కులాన్ని మాల, మాదిగ అంటూ రెండు కులాలుగా విడగొట్టాల్సిన అవసరం ఏముందని వాదించింది యువతి. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగానే తాను టవర్ ఎక్కి నిరసన తెలిపానంటూ చెప్పింది. అయితే పరేడ్ గ్రౌండ్స్‌లో అంత పెద్ద సభ నిర్వహించిందే ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా.
కేవలం ఇప్పుడు మాత్రమే కాదు.. చాలా ఏళ్లుగా వర్గీకరణకోసం పోరాటం జరుగుతోంది. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఈ విషయంలో జరిగింది మాత్రం శూన్యం. కానీ ప్రధాని మాత్రం ఈ విషయంలో సానుకూలంగా స్పందించారు. ఈ కారణంగానే ప్రధానిపై నిరసన గళాన్ని విప్పింది ఈ యువతి. వర్గీకరణ ఎందుకు అని ప్రశ్నించేందుకు టవర్ ఎక్కి తన నిరసన తెలిపింది.