Top story: అమెరికాలో తెలుగుజాతి పరువు బజారుపాలు, బ్లాక్ మెయిలింగ్, వ్యభిచారంలో అడ్డంగా బుక్

ఏ దేశమేగినా...ఎందుకాలిడినా...ఏ పీఠమెక్కినా....ఎవ్వరేమనిన పొగడరా నీ తల్లి భూమి భారతిని...నిలుపరా నీ జాతి నిండు గౌరవము అని సుప్రసిద్ధ రచయిత, కవి రాయప్రోలు సుబ్బారావు. ఆయన మంచి ఉద్దేశ్యంతో చెబితే...మనోళ్లు మరోలా అన్వయించుకుంటున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 6, 2025 | 08:30 PMLast Updated on: Jan 06, 2025 | 8:30 PM

Telugu Caste In America Is Being Exploited For Its Dignity Blackmailing And Prostitution

ఏ దేశమేగినా…ఎందుకాలిడినా…ఏ పీఠమెక్కినా….ఎవ్వరేమనిన పొగడరా నీ తల్లి భూమి భారతిని…నిలుపరా నీ జాతి నిండు గౌరవము అని సుప్రసిద్ధ రచయిత, కవి రాయప్రోలు సుబ్బారావు. ఆయన మంచి ఉద్దేశ్యంతో చెబితే…మనోళ్లు మరోలా అన్వయించుకుంటున్నారు. తెలుగు ప్రజల పరువును దేశ విదేశాల్లో బజారుకీడుస్తున్నారు. ఒకరేమో వ్యభిచారం నిర్వహిస్తారు…ఇంకొంకరు అవినీతికి పాల్పడుతారు…ఇంకొందరు కుల సంఘాలు మీటింగ్ లు పెడుతారు…ఇలా ఒక్కటేమిటి…చెప్పుకుంటూ పోతే గలీజు పనుల చిట్టా చాంతాడంత అవుతుంది. వడ్డీ వ్యాపారం చేసినా…వీసా మోసాల్లో అయినా…మనోళ్ల పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. అగ్రరాజ్యంలో ఏ చెత్త పని జరిగినా…అది తెలుగు రాష్ట్రాలకు లింక్ ఉంటోంది. తెలుగు జాతి పరువును అమెరికా నడి వీధుల్లోకి లాగేస్తున్నారు. ఇద్దరు ముగ్గురు చేస్తున్న దుర్మార్గపు పనులతో మిగిలిన వారికి చెడ్డ పేరు వస్తోంది.

నాలుగు రోజుల క్రితం అమెరికాలోని ఓ కిరాణా స్టోర్ ఓనర్ ను బెదిరించి…లక్ష డాలర్లు కొట్టేయాలని చిల్లర వెధవల ప్లాన్ వేశారు. తూకాల్లో మోసాలని.. బిర్యానీలో బొద్దింకలని బెదిరించే బాపతుగాళ్లు…తెలుగు రాష్ట్రాల్లోనే కాదు…అమెరికాలోనూ దందాలు షురూ చేశారు. ఎక్కడికి వెళ్లినా తమ బుద్ది మాత్రం పోనిచ్చుకోవడం లేదు. ఉప్పాల రోహిత్ అతని స్నేహితులు…అమెరికాలోని తెలుగు వాళ్లు నిర్వహిస్తున్న స్టోర్ కు వెళ్లి తూకాల్లో తేడాలున్నాయని బెదిరించారు. వీరిపై అనుమానం వచ్చిన కొందరు నిలదీశారు. ప్రస్తుతం వీరి వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇలాంటి పనులు కంత్రీ పనులు చేయడానికి…అమెరికాకే వెళ్లాల్సిన అవసరమే లేదు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి వాళ్లు…గల్లీగల్లీలో బోలెడు మంది ఉంటారు. చిల్లర దొంగల కంటే దరిద్రంగా అమెరికాలో వ్యవహారాలు నడుపుతున్నారు.

అమెరికాలో భారతీయులు, అందులోనూ తెలుగుజాతి అంటే కొంత మంచి పేరుంది. కొంతకాలంగా అక్కడ ఉంటున్న తెలుగువాళ్లు చేస్తున్న లుచ్చా పనులు…ఏపీ, తెలంగాణ పరువును తీస్తున్నాయి. అమెరికాలో ఎలాంటి నీచమైన, చెత్త పనుల గురించి ప్రస్తావించినా…తెలుగువాళ్ల పేర్లే ముందుంటున్నాయి. మనోళ్లు చేసే గలీజు పనులు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది. రూల్స్ ప్రకారం నడుచుకుంటామని అగ్రరాజ్యంలో అడుగు పెడతారు. అక్కడికి వెళ్లగానే…మనోళ్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఉద్యోగాలు, ఈవెంట్ల పేరుతో సినిమా, సీరియల్ నటీమణులను…తెలుగు రాష్ట్రాల నుంచి అమ్మాయిలను అమెరికాకు తీసుకెళ్లి…వ్యభిచారం నిర్వహించి అడ్డంగా బుక్కవుతున్నారు. ఇంకొందరు వీసా అక్రమాలకు పాల్పతున్నారు. తెలుగుజాతికి ఉన్న గుడ్ విల్ ను నాశనం చేయడంలో ముందున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో కుల పిచ్చి మాములుగా ఉండదు. ఏపీ తెలంగాణలో చాలదని…ఇపుడు అమెరికాలోనూ కులసంఘాలను ఏర్పాటు చేసుకున్నారు. ఎవరికి వారు…తమ కులాల పేరుతో సమావేశాలు పెట్టుకుంటున్నారు. మనం వెళ్లి ఉద్యోగాలు చేసుకొని…నాలుగు కాసులు సంపాదించుకోవడానికా…లేదంటే కుల సంఘాలు పెట్టుకోవడానికా అంటే సిగ్గు శరం లేకుండా తమకు కులమే ముఖ్యమని ఉన్న పరువును నాశనం చేస్తున్నారు. అమెరికాలో తెలుగు సినిమా చేయాలంటే…డిస్ట్రిబ్యూటర్లు వణికిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తమ హీరో గొప్ప అంటే…కాదు కాదు తమ హీరో గొప్ప అంటూ థియేటర్లలో ఫైటింగ్ చేస్తున్నారు. యాపిల్ సంస్థలో పని చేస్తున్న 185 మంది తెలుగు వాళ్లు…డోనేషన్స్ ను తెలుగు అసోసియేషన్లకు ఇచ్చాయి. అయితే డోనేషన్ల రూపంలో ఇచ్చిన మొత్తం…తిరిగి ఉద్యోగుల ఖాతాల్లోనే పడుతున్నట్లు తేలింది. యాపిల్ సంస్థను మోసం చేయడానికి 185 మంది తెలుగు ఉద్యోగులు..మ్యాచింగ్ గ్రాంటును తెలుగు అసోసియేషన్లను ఇచ్చినట్లు యాపిల్ సంస్థ దర్యాప్తులో వెల్లడైంది.