ఉ.. పోయిస్తున్న ఏపీ పోలీసులు, వైసీపీలో టెర్రర్ స్టార్ట్

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో రెచ్చిపోయిన కొంతమందికి ఇప్పుడు చుక్కలు చూపిస్తున్నారు పోలీసులు. మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు అలాగే సినిమా వాళ్ళు..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 12, 2025 | 11:59 PMLast Updated on: Mar 12, 2025 | 11:59 PM

Terror Starts In Ap Ycp

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో రెచ్చిపోయిన కొంతమందికి ఇప్పుడు చుక్కలు చూపిస్తున్నారు పోలీసులు. మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు అలాగే సినిమా వాళ్ళు.. ఇలా ఎవరైనా సరే అప్పట్లో చెలరేగి పోతే వాళ్ళందరికి… ఇప్పుడు ఏం చేయాలో అది చేసి చూపిస్తోంది కూటమి ప్రభుత్వం. ఇక పోలీసులు కూడా ఈ విషయంలో సీరియస్ గానే వ్యవహరిస్తున్నారు. అప్పట్లో పోలీస్ అధికారులను కంట్రోల్ లో… పెట్టుకుని అన్ని విధాలుగా ఆడించిన వైసీపీని ఇప్పుడు కొంతమంది పోలీసులు కాస్త సీరియస్ గానే తీసుకున్నారు.

తమను అవమానించిన వైసీపీ నేతలపై పోలీసులు గట్టిగానే దృష్టి పెట్టినట్లు అర్థమవుతుంది. దానికి తోడు వాళ్ళ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ గానే వ్యవహరిస్తోంది. భవిష్యత్తులో ఏం జరిగినా సరే ఎదుర్కోవడానికి.. పోలీసు వ్యవస్థ కూడా సిద్ధంగానే ఉన్నట్లు స్పష్టంగా అర్థం అవుతుంది. ముందు పోలీసులు కాస్త భయపడినట్లు కనపడినా… ఇప్పుడు పోలీసులు అన్ని విధాలుగా దారిలోకి వచ్చినట్లుగానే తెలుస్తోంది. ఒకప్పుడు జగన్ బెదిరింపులను సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఇప్పుడు మాత్రం ఈ విషయంలో పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.కొంతమంది నాయకులను అరెస్టు చేసే విషయంలో పోలీసులు అప్పట్లో భయపడ్డారు. కాని రాష్ట్ర ప్రభుత్వం నుంచి వారికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందడంతో పోలీసు వర్గాలు… తాము ఏం చేయాలనుకున్నాయో అది చేస్తున్నాయి. వల్లభనేని వంశీ మోహన్ విషయంలో పోలీసులు అదే దూకుడు ప్రదర్శించారు. అలాగే బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ వ్యవహారంతో పాటుగా… వైసీపీ మద్దతుదారుగా ఉన్న రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ వ్యవహారంలో కూడా పోలీసులు ఇదే దూకుడు చూపించారు.

ఇక తాజాగా పోసాని కృష్ణమురళితో పాటుగా మాజీ మంత్రి విడుదల రజిని వై కూడా పోలీసులు సీరియస్ గానే ఫోకస్ పెట్టారు. మాజీ మంత్రులు అవినీతి వ్యవహారాలను ఇప్పుడు ఏసీబీ అధికారులతో పాటుగా సిఐడి అధికారులు కూడా సీరియస్ గానే తీసుకొని దూకుడుగా వ్యవహరిస్తున్నారు. బెదిరింపులకు అక్రమాలకు అవినీతి వ్యవహారాలకు పాల్పడిన నాయకులు… అలాగే వైసిపి సానుభూతిపరులపై గట్టిగానే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. పోసాని కృష్ణమురళి వ్యవహారం లో పోలీసులు చూపించిన దూకుడు చూస్తే వైసిపి నేతలకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.ముఖ్యంగా పిటి వారెంట్ విషయంలో పోలీసులు పక్కాగా వ్యవహరిస్తున్నారు. పోసాని కృష్ణమురళి విడుదలవుతారు అనుకున్న చివరి నిమిషంలో… సిఐడి అధికారులు రంగంలోకి దిగారు. ఇక అక్కడి నుంచి పరిస్థితి వేగంగా మారింది. ఆయన హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసినా సరే లాభం లేకుండా పోయింది. దీనితో మరి కొన్నాళ్లపాటు పోసాని కృష్ణ మురళి జైల్లోనే ఉండే అవకాశాలు కనబడుతున్నాయి.