టాటాలతో టెస్లా…!
టెస్లా కార్లు... ఆటో రివెల్యూషన్... మోడరన్... హై ఎండ్.. ది బెస్ట్ ఈవీస్... ఇవన్నీ మన రోడ్లపైకి ఎంటరైతే... భారత రోడ్లపై ఖరీదైన టెస్లా పరుగులు తీస్తే... ఆ రోజు ఎంతో కాలం లేదు. త్వరలోనే ఇవి రయ్ రయ్ మంటూ దూసుకుపోనున్నాయి.

టెస్లా కార్లు… ఆటో రివెల్యూషన్… మోడరన్… హై ఎండ్.. ది బెస్ట్ ఈవీస్… ఇవన్నీ మన రోడ్లపైకి ఎంటరైతే… భారత రోడ్లపై ఖరీదైన టెస్లా పరుగులు తీస్తే… ఆ రోజు ఎంతో కాలం లేదు. త్వరలోనే ఇవి రయ్ రయ్ మంటూ దూసుకుపోనున్నాయి. టెస్లా ఇండియా ఎంట్రీ ఖరారైపోయింది. పన్నులు తగ్గిస్తేనే వస్తానంటూ మస్క్, ఇక్కడే ప్లాంట్ పెట్టాలని భారత్ ఇన్నాళ్లూ పట్టుబట్టాయి. దీనిపై చాలాకాలం చర్చలు నడిచినా ప్రయోజనం లేకుండా పోయింది. మొన్నటి అమెరికా పర్యటనలో మోడీ, మస్క్ భేటీలో డీల్ సెట్ అయ్యింది. ఇండియన్ మార్కెట్‌లోకి ఎంటరయ్యేందుకు టెస్లా ప్లాన్స్ స్పీడప్ చేసింది. ఇప్పటికే ఇక్కడ ఆఫీస్ స్పేస్‌ను సిద్ధం చేసుకుంది. దీంతోపాటు ఉద్యోగుల నియామకానికి కూడా నోటిఫికేషన్ ఇచ్చేసింది. తమకు కావాల్సిన ఉద్యోగుల వివరాలను లింక్డ్ ఇన్‌లో పోస్ట్ చేసింది.
ఇంతకీ టెస్లా ఇండియాలో ఎన్ని పెట్టుబడులు పెట్టబోతోందో తెలుసా.. 300 నుంచి 500 బిలియన్ డాలర్లు.. మన కరెన్సీలో చెప్పాలంటే 26లక్షల కోట్ల నుంచి 43లక్షల కోట్ల వరకూ టెస్లా ఇండియాలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. దశల వారీగా ఈ మొత్తం రాబోతోంది. త్వరలో భారత్ రాబోతున్న టెస్లా ప్రతినిధులు ప్రధాని నరేంద్రమోడీతో భేటీ కాబోతున్నారు. ఏప్రిల్‌లో టెస్లా టీమ్ ఇండియాకు వస్తుందని చెబుతున్నారు. వారు ఇప్పటికే పీఎంవోతో చర్చల్లో ఉన్నారు. అప్పుడే పెట్టుబడి వివరాలు, ప్లాంట్ ఎక్కడపెట్టేది క్లారిటీ వస్తుంది.
టెస్లా ఇండియన్ ప్లాన్స్ ఇప్పటివి కావు. వరల్డ్ బిగ్గెస్ట్ మార్కెట్ అయిన ఇండియాలోకి ఎంటర్ కావాలని చాలా కాలంగా మస్క్ ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రతిపాదన చాలాసార్లు చివరివరకు వచ్చి ఆగిపోయింది. 2021లోనే టెస్లా ఇండియాలో కంపెనీ పెట్టాలని డిసైడైంది. ముంబయిలో ఆఫీస్‌ను కూడా రెడీ చేసుకుంది. అయితే ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించడానికి కేంద్రం నిరాకరించడంతో దానికి బ్రేక్ పడింది. 2023లో కూడా చర్చలు జరిగాయి. ఇక 2024లో భారత్ తన ఈవీ పాలసీని అప్‌డేట్ చేసింది. కనీసం 500మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టే కంపెనీలకు ప్రోత్సాహకాలు ప్రకటించింది.
2024మేలో మస్క్ భారత్‌కు భారత్‌కు వస్తారని ప్రచారం జరిగినా ఆయన దాన్ని వాయిదా వేసుకున్నారు. కానీ ఇప్పుడు మోడీ యూఎస్ టూర్ తర్వాత లెక్కలు మారాయి. ఇటీవల బడ్జెట్‌లో వాహనాలపై పన్నులు తగ్గించడం కూడా మస్క్ ఎంట్రీకి రాచబాట వేయడానికే.. భారత్‌లో తయారీకి సిద్ధమైతే భారీగా రాయితీలు ఇస్తామని కేంద్రం చెబుతోంది. కేంద్రం ప్రవేశపెట్టిన ఈవీ పాలసీ ప్రకారం ఏదైనా విదేశీ కంపెనీ మన దేశంలో తయారీ యూనిట్ ప్రారంభించి కనీసం 5వందల మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైతే ఆ సంస్థ ఏటా 8వేల ఈవీలను 15శాతం పన్నుతో దిగుమతి చేసుకోవచ్చు. అయితే మూడేళ్లలో కనీసం సగం పెట్టుబడి అయినా పెట్టి ఉండాలి.
ఇండియాలోకి ఎంటరైతే మార్కెట్‌ను ఎలా క్యాప్చర్ చేయాలన్న దానిపై మస్క్ ఇప్పటికే ఫోకస్ పెట్టారు. భారత్‌లో ఎలక్ట్రిక్ వెహికిల్ ప్లాంట్‌ను మహారాష్ట్రలో ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని స్థలాలను కూడా గుర్తించింది. ఓకే అనుకున్న వెంటనే ప్రభుత్వంతో డీల్ కుదుర్చుకుని వెంటనే పనులు మొదలుపెట్టాలన్నది టెస్లా ప్లాన్. దీనికి సంబంధించి ఇప్పటికే రోడ్‌మ్యాప్ రెడీ అయ్యింది. మహారాష్ట్రలోనే ప్లాంట్ ఏర్పాటు చేయాలని అనుకోవడం వెనక చాలా కారణాలే ఉన్నాయి. పుణేలో ఆ పార్టీకి ఆఫీస్ స్పేస్ ఉంది. కొంతమంది సప్లయర్స్ కూడా ఉన్నారు. పుణెకు సమీపంలోని చంకన్, చికాలిలో స్థలాలు ఇచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఆ ప్రాంతంలోనే మెర్సిడజ్ బెంజ్, టాటామోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, వోక్స్ వ్యాగన్, బజాజ్ ఆటో వంటి సంస్థలు ఉన్నాయి.
ఓ రకంగా అది ఆటోమోటివ్ హబ్… అందుకే ఆ ప్రాంతంలోనే ప్లాంట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని టెస్లా ఆలోచిస్తోంది. అయితే ప్లాంట్‌ను పోర్టుకు దగ్గరగా ఉండే ప్రాంతంలో ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో కూడా టెస్లా ఉన్నట్లు చెబుతున్నారు. అలాగైతేనే రవాణాకు, ఎక్స్‌పోర్ట్‌కు అనుకూలంగా ఉంటుందని భావిస్తోంది. ఇక్కడ తయారు చేసి మొత్తం ఇక్కడే అమ్మడం టెస్లా ఆలోచన కాదు. ఇతర దేశాలకు కూడా ఇక్కడ్నుంచి ఎక్స్‌పోర్ట్ చేయాలన్నది దాని ప్లాన్. అందుకే షిప్పింగ్‌కు వీలుగా పోర్ట్ ఉండాలని కోరుకుంటోంది. గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం వేదాంత-ఫాక్స్‌కాన్ సెమీకండక్టర్ ప్లాంట్, టాటా ఎయిర్‌బస్ ప్రాజెక్టును వదులుకుంది. కాబట్టి ఈసారి గోల్డెన్ ఆపర్చ్యునిటీ లాంటి టెస్లాను మిస్ చేసుకోకూడదని భావిస్తోంది. అయితే మరికొన్ని రాష్ట్రాలతో కూడా బేరసారాలు ఆడాలని టెస్లా ప్రయత్నిస్తున్నట్లు బిజినెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇంకెవరైనా మహారాష్ట్ర కన్నా ఎక్కువ రాయితీలు ఇచ్చి తమకు అనుకున్నట్లుగా అంతా ఉంటే వాటిని పరిశీలించే అవకాశాలు కూడా లేకపోలేదు. గుజరాత్ కూడా గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఏపీ, తెలంగాణ కూడా ఆసక్తిని చూపుతున్నట్లు చెబుతున్నా వాటికి అవకాశాలు కాస్త తక్కువగానే కనిపిస్తున్నాయి.
టాటాలతో టెస్లా కొలాబరేషన్ పెట్టుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా టాటాలకు ఉన్న విస్తృత నెట్‌వర్క్ తమకు కలసి వస్తుందన్నది మస్క్ ఆలోచన. ఇండియాలో ప్లాంట్ పెట్టాలన్న ఆలోచనకు రాగానే టాటామోటర్స్‌తో టెస్లా టచ్‌లోకి వెళ్లినట్లు చెబుతున్నారు. దీనిపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. మరికొన్ని రోజుల్లో దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
టెస్లా ఇండియన్ ఎంట్రీ ఓ రకంగా గేమ్ చేంజర్ అనే చెప్పాలి. ఇప్పటికే మన దగ్గర ఖరీదైన ఈవీలు ఉన్నప్పటికీ టెస్లా ఎంటరైతే సీన్ మొత్తం మారిపోతుందని భావిస్తున్నారు. ఈవీల ధరలు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. మిగిలిన ఆటో కంపెనీలు ఈ పరిణామాలను జాగ్ర్తతగా గమనిస్తున్నాయి. టెస్లా ఎంటరైతే తమ వ్యూహాలను ఎలా మార్చుకోవాలన్నదానిపై ఫోకస్ పెట్టాయి. చూడాలి మరి మన మార్కెట్‌ను టెస్లా ఎలా తట్టుకుంటుందో.. ఎలా పట్టుకుంటుందో…!