ఆ ఒక్క సెల్ఫీ ,మావోయిస్ట్ చలపతి ప్రాణం తీసింది
మన అదృష్టం బాగా లేకపోతే తాడే పామై కాటేస్తుంది. పెద్దలు చెప్పే ఈ మాట మావోయిస్ట్ అగ్రనేత చలపతి విషయంలో నిజమయ్యింది. సాధారణంగా తన కదలికల విషయంలో చలపతి చాలా జాగ్రత్తగా, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంటారు.
మన అదృష్టం బాగా లేకపోతే తాడే పామై కాటేస్తుంది. పెద్దలు చెప్పే ఈ మాట మావోయిస్ట్ అగ్రనేత చలపతి విషయంలో నిజమయ్యింది. సాధారణంగా తన కదలికల విషయంలో చలపతి చాలా జాగ్రత్తగా, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంటారు. ఆయనను పట్టుకునేందుకు చాలా ఏళ్ల నుంచి భద్రతా బలగాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. కానీ ఎలాంటి యూజ్ లేదు. ఎంత పెద్ద ప్లాన్ వేసినా చాలా సింపుల్‌గా చలపతి తప్పించుకునేవాడు. అలాంటి వ్యక్తి జనవరి 20న ఆయన ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. దీనికి దారితీసిన బలమైన కారణం ఒకటి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. 2016 మే నెలలో ఆంధ్రప్రదేశ్ పరిధిలోని అడవుల్లో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య భీకర కాల్పులు జరిగాయి.
ఆ ఘటనల మావోయిస్టులకు చెందిన ఒక స్మార్ట్ ఫోన్ పోలీసుల చేతికి చిక్కింది. దానిలోని సమాచారాన్ని జల్లెడపట్టగా మావోయిస్టు అగ్రనేత చలపతి తన భార్య అరుణతో దిగిన ఒక సెల్ఫీ కనిపించింది. ఎప్పుడో యువకుడిగా ఉన్నప్పుడు మావోయిస్టుల్లో చేరిపోయాడు చలపతి. ఇప్పుడు రూపురేఖలు ఎలా ఉన్నాయి.. అతడి పోలికలు ఏంటి అనేది అంతుచిక్కకుండా ఉన్న తరుణంలో.. ఈ సమాచారం పోలీసులకు బాగా ఉపయోగపడింది. అప్పటి నుంచి గాలింపు మరింత తీవ్రతరం చేశారు. రీసెంట్‌గా జనవరి 20న ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దుల్లోని అడవుల్లో తన టీమ్‌తో కలిసి చలపతి వెళ్తుండగా భద్రతా బలగాలు చుట్టుముట్టాయి.
అప్పటికే చలపతి ఫొటో వాళ్ల దగ్గర ఉండటంతో ఎట్టిపరిస్థితుల్లో మిస్ అవ్వకుండా మావో టీంను టార్గెట్ చేశాయి. మొత్తము 14 మందిలో చలపతి కీలక నేత కావడంతో అతన్నే టార్గెట్ చేశాయి. మిగతావాళ్లు మిస్ అయినా పర్లేదు కానీ చలపతి మిస్ అవ్వొద్దన్న టార్గెట్‌లో పాయింట్ అవుట్ చేసి లేపేశాయి. చనిపోయాడని నిర్ధారించుకునేంతవరకూ వేటాడి మట్టుబెట్టేశాయి. ఇలా అప్పుడు దొరికిన సెల్ఫీ ఇప్పుడు చలపతి ఎన్కౌంటర్‌లో కీలకంగా మారింది. ఒకవేళ పోలీసుల దగ్గర ఈ ఫొటో లేకపోయి ఉంటే ఆ స్థాయిలో చలపతిని టార్గెట్ చేసేవాళ్లు కాదనే టాక్ వినిపిస్తోంది. ఆధారం ఉంది కాబట్టే మిస్ అవ్వకుండా లేపేశారని తెలుస్తోంది. భార్యతో తీసుకున్న ఆ సెల్ఫీ ఇలా మావోయిస్ట్ అగ్రనేతను మట్టుబెట్టేలా చేసింది.