నేడు హాట్ హాట్ గా ఏపీ హైకోర్ట్
ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ లో నేడు కీలక కేసులపై విచారణ జరగనుంది. తిరుపతి లడ్డు వివాదం పై వైసిపి వేసిన పిటిషన్ నేడు విచారణ జరుగుతోంది. సిట్టింగ్ జడ్జి లేదా కాన్స్టిట్యూషన్ కమిటీతో విచారణ చెయ్యాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. దీనిపై నేడు విచారణ జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ లో నేడు కీలక కేసులపై విచారణ జరగనుంది. తిరుపతి లడ్డు వివాదం పై వైసిపి వేసిన పిటిషన్ నేడు విచారణ జరుగుతోంది. సిట్టింగ్ జడ్జి లేదా కాన్స్టిట్యూషన్ కమిటీతో విచారణ చెయ్యాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. దీనిపై నేడు విచారణ జరుగుతోంది. ఎంఎల్ఏ ఆదిమూలం కేస్ లో నేడు జడ్జిమెంట్ వచ్చింది. తనపై నమోదు అయిన లైంగిక వేధింపుల కేసు క్వాష్ చేయాలని పిటీషన్ వేయగా… క్వాష్ చేయాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది.
వైసిపి నేత నందిగాం సురేష్ బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టు లో విచారణ చేయనుంది. టిడిపి ఆఫీస్ పై దాడి కేస్ లో హైకోర్టు ను నందిగాం సురేష్ ఆశ్రయించారు. దీనిపై నేడు విచారణ జరగనుంది. ఎర్రమట్టి దిబ్బలు విధ్వంసం, భీమిలి బిల్డింగ్ సొసైటీకి కేటాయించిన 280 ఎకరాల స్థలం రద్దు చేయాలంటూ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ హైకోర్టులో ఇటీవల పిల్ దాఖలు చేయగా దానిపై కూడా విచారణ జరగనుంది.
భీమిలి తీరంలో విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి సీఆర్‌జెడ్ నిబంధనలకు విరుద్ధంగా కట్టిన నిర్మాణాలపై వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరపనుంది కోర్ట్. కోర్టు ఆదేశాలతో గత కొన్ని రోజులుగా అక్రమ కట్టడాలను జీవీఎంసీ అధికారులు కూలుస్తున్నారు. నేహారెడ్డి నిర్మాణాలపై తీసుకున్న చర్యలేంటనేది నేడు కోర్టుకు నివేదిక సమర్పిస్తారు. కైలాస గిరి కొండ కింద పార్కింగ్ ఏరియాలో నిర్మాణాలపై మూర్తియాదవ్ వేసిన మరో పిటిషన్ పై నేడు విచారణ జారగనుంది.