దేవీ శ్రీ ప్రసాద్‌కు ఊహించని షాక్ ఇచ్చిన ఏపీ సర్కార్.. పవన్ కళ్యాణ్ ఉన్నా కూడా..!
ఏపీలో సినిమా వాళ్లకు ఎలాంటి అనుమతులు కావాలన్నా కూడా అక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి ఈజీగా అయిపోతుందనే నమ్మకం వచ్చేసింది.

ఏపీలో సినిమా వాళ్లకు ఎలాంటి అనుమతులు కావాలన్నా కూడా అక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి ఈజీగా అయిపోతుందనే నమ్మకం వచ్చేసింది. అయితే కొన్నిసార్లు పవన్ ఉన్నా కూడా పనులు జరగవు. తాజాగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్‌కు ఇలాంటి షాక్ ఎదురైంది. ప్రస్తుతం తెలుగు మాత్రమే కాదు.. ప్యాన్ ఇండియన్ వైడ్‌గా పాపులర్ అయ్యాడు దేవీ. ఈయన పాటలంటే చెవులొక్కటే కాదు ముక్కులు, చేతులు, కాళ్లు కూడా కోసుకునే సంగీత ప్రియులున్నారు. సినిమాలతో పాటు ఈయన ఎప్పటికప్పుడు మ్యూజికల్ కాన్సర్టులు కూడా చేస్తుంటాడు. కెరీర్ మొదటి నుంచి ఇదే అలవాటుగా చేసుకున్నాడు DSP. తాజాగా ఏపీలో కూడా అలాంటి ఓ మ్యూజికల్ నైట్ ప్లాన్ చేసాడు దేవీ. కానీ ఈయన ప్లానింగ్‌కు తాజాగా విశాఖపట్నం పోలీసులు షాక్ ఇచ్చారు.
అసలు విషయం ఏంటంటే.. ఏప్రిల్ 19న విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్‌లో ఒక మ్యూజికల్ కాన్సెప్ట్ ప్లాన్ చేసాడు దేవీ. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా మొదలు పెట్టాడు దేవి శ్రీ ప్రసాద్. ఎలాగూ పవన్ కళ్యాణ్ ఉన్నాడు.. పైగా చంద్రబాబు సర్కార్ కూడా నో చెప్పే సమస్యే లేదనే ధైర్యంతో ఈ కాన్సర్ట్ ఏర్పాటు చేసుకున్నాడు దేవీ. ఇక పోలీసుల అనుమతిని కోరగా.. దానికి వాళ్లు నో చెప్పినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ షో కి సంబంధించి ఆన్‌లైన్ టికెట్లు కూడా అమ్ముడైపోయినట్లు ప్రచారం జరుగుతుంది. ఇలాంటి సమయంలో పోలీసుల నుంచి ఊహించని నిర్ణయం వచ్చింది. భద్రతా కారణాలతో దేవి శ్రీ ప్రసాద్ నిర్వహించాలనుకున్న ఈ మ్యూజికల్ కాన్సెప్ట్‌కు అనుమతులు ఇవ్వలేమంటూ వైజాగ్ CP శంఖబ్రత బాగ్చి వెల్లడించారు.
ఇప్పుడు దేవీ మ్యూజికల్ నైట్ ప్లాన్ చేస్తున్న అదే విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్‌లోని వాటర్ వరల్డ్‌లో బాలుడు మరణించాడు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఈ మ్యూజికల్ కాన్సెప్ట్ చేయడానికి అనుమతి ఇవ్వలేదని తెలుస్తుంది. కారణం ఏదైనా కూడా దేవీకి ఊహించని షాక్ అయితే ఇచ్చింది ఏపీ సర్కార్. ఎంతోమంది అభిమానులు టికెట్లు కూడా కొన్న తర్వాత షో క్యాన్సిల్ అవ్వడంతో దేవీ శ్రీ ప్రసాద్‌కు కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదిప్పుడు. ఈ విషయంలో దేవీ నెక్ట్స్ స్టెప్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. పవన్ కళ్యాణ్‌ను కలిసి ఏదైనా పర్మిషన్ కోసం ప్రయత్నిస్తాడా లేదంటే వేరే చోటుకు ఈ ఈవెంట్ మార్చేస్తారా అనేది సస్పెన్స్‌గా మారింది.