చాగంటికి మరో బాధ్యత
ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు మరో బాధ్యత అప్పగించింది ఏపీ సర్కార్. ఇప్పటికే విద్యార్థులు - నైతిక విలువల సలహాదారుగా ఏపీ ప్రభుత్వం ఆయనను నియమించింది.

ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు మరో బాధ్యత అప్పగించింది ఏపీ సర్కార్. ఇప్పటికే విద్యార్థులు – నైతిక విలువల సలహాదారుగా ఏపీ ప్రభుత్వం ఆయనను నియమించింది. కేబినెట్ హోదాతో ఈ బాధ్యతలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మరో బాధ్యతను అప్పగించింది. విద్యార్థుల్లో నైతిక విలువలను పెంచేందుకు చాగంటితో ప్రభుత్వం ప్రత్యేకంగా పుస్తకాలను తయారు చేయించి, విద్యార్థులకు పంపీణీ చేయడానికి రెడీ అయింది.
ఈ మేరకు రెండు రోజుల క్రితం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. కేబినెట్ నిర్ణయం మేరకు చాగంటికి అదనపు బాధ్యతలను అప్పగించగా ఆయన ఆ బాధ్యతలను స్వీకరించారు. పిల్లలకు ఉపయోగపడేలా నాలుగు మంచి మాటలు చెప్పాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇచ్చిన బాధ్యతలను స్వీకరిస్తున్నానని అన్నారు. పదవుల కోసం తాను ఒప్పుకోలేదని… తన మాటలతో పిల్లలకు మేలు జరిగితే చాలని… పుస్తకాలను మంచి విలువలతో అందిస్తాను అని చెప్పారు చాగంటి.