Top story:దేశాన్ని కుదిపేయబోతున్న ఏపీ లిక్కర్ స్కామ్, ఏపీ లిక్కర్ స్కామ్ లో జగన్ అరెస్టు తప్పదా?
ఏపీ రాజకీయాలను లిక్కర్ స్కాం ఆరోపణలు కుదిపేస్తున్నాయి. టిడిపి ఒత్తిడికి తలోగ్గి కేంద్రం ఏపీ లిక్కర్ స్కామ్ ని సీరియస్ గా తీసుకుంటే వైసీపీలో పెద్ద తలకాయలు లోపలికి వెళ్లక తప్పదు.

ఏపీ రాజకీయాలను లిక్కర్ స్కాం ఆరోపణలు కుదిపేస్తున్నాయి. టిడిపి ఒత్తిడికి తలోగ్గి కేంద్రం ఏపీ లిక్కర్ స్కామ్ ని సీరియస్ గా తీసుకుంటే వైసీపీలో పెద్ద తలకాయలు లోపలికి వెళ్లక తప్పదు. 2019 ..24 మధ్య వైసీపీ హాయంలో ఢిల్లీని మించిన స్థాయిలో లిక్కర్ స్కాం జరిగిందని ఏపీలో అధికార కూటమి ఆధారాలతో సహా బయట పెట్టబోతోంది. టిడిపి ఎంపీలు పార్లమెంట్ సాక్షిగా ఏపీ లిక్కర్ స్కాంపై రచ్చ రచ్చ చేస్తున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో ప్రాథమిక దర్యాప్తు నివేదికని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కి అందజేశారు టిడిపి ఎంపీలు. లిక్కర్ స్కాం పచ్చి అబద్దమంటోంది వైసీపీ. జగన్ని జైల్లో పెట్టించడానికి టిడిపి ఒక పథకం ప్రకారం ఇదంతా చేస్తోందని వైసిపి ఆరోపిస్తోంది. కానీ ఈ స్కాంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రాథమిక దర్యాప్తు మొత్తం పూర్తి చేసింది. ముగ్గురు అనుమానితుల్ని పిలిచి 164 కింద మొత్తం సమాచారాన్ని సేకరించింది. అలాగే ఏపీ బ్రేవరీస్ ఎండి వాసుదేవ రెడ్డి నుంచి కూడా అధికారికంగా సమాచారం సేకరించింది.
ఏపీ లిక్కర్ స్కామ్ లో స్కాంలో జగన్ సన్నిహితుడు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ,ఆయన కొడుకు ప్రస్తుత ఎంపీ మిథున్ రెడ్డి పేర్లు ఉండటంతో విషయం హాట్ హాట్ గా మారింది. ఇదే అంశాన్ని పార్లమెంట్ లో ప్రస్తావించిన టీడీపీ, ఈడీ దర్యాప్తునకు డిమాండ్ చేయడంతో లిక్కర్ స్కాం ఆరోపనలు హీటెక్కాయి.జగన్ ప్రభుత్వంలో లిక్కర్ స్కాం జరిగిందని… వ్యవస్థలను చేతిలో పెట్టుకున్న అప్పటి ప్రభుత్వం డిస్టలరీలను స్వాధీనం చేసుకుని విచ్చలవిడిగా సొంత బ్రాండ్లు సృష్టించి మద్యం అమ్మకాలు చేపట్టిందని టీడీపీ ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది. దాని మీదే గత ఏడాది సెప్టెంబర్ లో కేసు కూడా నమోదు చేశారు. అప్పట్లో ఏపీ బేవరేజెస్ కార్పోరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి అరెస్టు కూడా జరిగింది.. మొత్తం వ్యవహారం వెనుక మిథున్ రెడ్డి ఉన్నారని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. అంతేకాకుండా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డి తెర వెనుక పాత్ర పోషించాడని కూడా ఆరోపిస్తుంది సర్కార్. ఇదే విషయాన్ని పార్లమెంట్ లో ప్రస్తావించారు టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు. జగన్ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో 90వేల కోట్ల రూపాయల మద్యం వ్యాపారం జరిగితే అందులో 18 వేల కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయని .. మరో 4వేల కోట్లు బినామీల పేర్లతో దుబాయ్, ఆఫ్రికా దేశాలకు తరలించారని ఆరోపణలు చేశారు ఎంపీ.
అయితే ఇదంతా జగన్ ను అరెస్ట్ చేయడానికేనని ycp ఆరోపిస్తోంది. వాసుదేవరెడ్డిని బెదిరించి స్లేట్ మెంట్ తీసుకున్నారని ఇదే విషయాన్ని అతను హైకోర్టులో కూడా చెప్పారని అంటున్నారు వైసీపీ నేతలు.మరోవైపు ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టుకు వెళ్లాడు మిథున్ రెడ్డి. అసలు కేసే నమోదు కానప్పుడు బెయిల్ ప్రస్తావన ఎక్కడని ప్రభుత్వ తరపు లాయర్ వాదించాడు. గత ప్రభుత్వంలో ప్రత్యేక అధికారిగా పని చేసిన సత్యప్రసాద్ ఇచ్చిన 164 స్టేట్మెంట్ ఆధారంగా మిథున్ రెడ్డి బెయిల్ కోరడానికి వీలులేదని ప్రభుత్వ వాదన. ఈ కేసులో మిధున్ రెడ్డి తాత్కాలిక ఉపశమనం పొందాడు. ఆయన్ని అరెస్టు చేయవద్దంటూ కోర్టు ఆదేశించింది. అయితే టెక్నికల్ గా ఈ స్కాము కు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే పూర్తి సమాచారం సేకరించింది. ఇదంతా కేంద్రానికి కూడా అందజేసింది. అమిత్ షా ,మోడీ ఇద్దరు అంగీకరిస్తేనే ఈ కేసులో జగన్నీ ఇరికించడం సాధ్యమవుతుంది. కానీ ఇప్పటికీ జగన్ విషయంలో బిజెపి సానుకూలంగానే ఉంది. వైసీపీ ఏపీలో ఓడిపోయినప్పటికీ ఎప్పటికైనా అదే అక్కడ ప్రత్యర్థి పార్టీ. అందువల్ల ఇప్పటికిప్పుడు ఈ కేసులో జగన్ ని లోపల వేస్తే భవిష్యత్తులో మళ్లీ అతన్ని ఉపయోగించుకోవడం ఎలా అన్నది కూడా బిజెపి వాళ్లు ఆలోచిస్తారు. లేదు లిక్కర్ కేసులో జగన్ నిందితుని చేసి, ఎఫ్ఐఆర్ చేసి అతని కంట్రోల్ చేద్దామని అని కూడా అనుకోవచ్చు. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో ఏపీ లిక్కర్ స్కాం రాజకీయంగా సంచలనాలు సృష్టించి పోతుంది.