Modi VS Rahul : మోడీ కంటే రాహుల్ అంత ధనవంతుడా!
దేశవ్యాప్తంగా ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతోంది. ఓ పక్క ప్రతిపక్ష కూటమి, మరో పక్క బీజేపీ. అధికారం చేజిక్కించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే దాదాపు పోలింగ్ క్లైమాక్స్‌కు చేరుకుంది. మరి కొన్ని రోజుల్లోనే దేశానికి అధినేత ఎవరో తేలిపోతుంది. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ ఇప్పటికే వయనాడ్ నుంచి పోటీ చేశారు.
దేశవ్యాప్తంగా ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతోంది. ఓ పక్క ప్రతిపక్ష కూటమి, మరో పక్క బీజేపీ. అధికారం చేజిక్కించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే దాదాపు పోలింగ్ క్లైమాక్స్‌కు చేరుకుంది. మరి కొన్ని రోజుల్లోనే దేశానికి అధినేత ఎవరో తేలిపోతుంది. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ ఇప్పటికే వయనాడ్ నుంచి పోటీ చేశారు. ఇప్పుడు రాయ్‌బరేలి నుంచి కూడా నామినేషన్ వేశారు. మోడీ కూడా వారణాసి నుంచి నామినేషన్ వేశారు. ఇద్దరూ ఒకే స్టేట్ నుంచి పోలీటీ చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం ఇద్దరూ తమ ఆస్తులు అప్పులు వివరాలు ఈసీకి అఫిడవిట్ రూపంలో అందించారు.
ఇక్కడే ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ బయటికి వచ్చింది. మోడీ, రాహుల్ (Modi VS Rahul) .. ఈ ఇద్దరిలో ఎవరు బాగా రిచ్ అని తెగ వెతికేస్తున్నారు నెటిజన్లు. ఎన్నికల అధికారులు రాహుల్ (Rahul Gandhi) ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం.. రాహుల్ ఆస్తులు 20 కోట్లు. అందులో 9 కోట్ల 24 లక్షల చరాస్తులు, 11 కోట్ల 15 లక్షల స్థిరాస్తులు. తన దగ్గర 55 వేల నగదు, 26 లక్షల 25 వేల బ్యాంకు డిపాజిట్లు, 4 కోట్ల 33 లక్షల బాండ్లు ఉన్నట్టు రాహుల్ చెప్పారు. వీటితో పాటు 3 కోట్ల 81 లక్షల విలువైన మ్యూచువల్ ఫండ్స్, 15 లక్షల 21 వేల విలువైన గోల్డ్ బాండ్లు, 4 లక్షల 20 వేల విలువైన బంగారు అభరణాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం తనకు 11 కోట్ల 15 లక్షలు విలువ చేసే స్థిరాస్తులు ఉన్నాయని.. అందులో తన సోదరి ప్రియాంక గాంధీకి (Priyanka Gandhi) కూడా వాటా ఉందని చెప్పారు. ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ భూమి తనకు వారసత్వంగా వచ్చిందని.. ఆ ఆస్తినే ప్రియాంక గాంధీతో పంచుకున్నానంటూ చెప్పారు. అలాగే గురుగ్రామ్ ప్రాంతంలో 9 కోట్ల విలువైన ఆఫీసు కూడా తనకు ఉందని చెప్పారు. ఇక మోడీ కూడా తన ఆస్తుల వివరాలు ఈసీకి వివరించారు.
తన మొత్తం ఆస్తుల విలువ 3 కోట్ల 2 లక్షలు అని అఫిడవిట్‌లో పేర్కొన్నారు మోడీ(Modi). తనకు సొంత ఇల్లు, కారు లేవని తెలిపారు. అంతే కాకుండా తన పేరు మీద ఎలాంటి షేర్లు లేవని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రధాని మోడీ దగ్గర 52 వేల 920 రూపాయల నగదు మాత్రమే ఉందట. ఆయన బ్యాంకు అకౌంట్‌లో 80 వేల 304 రూపాయలు ఉన్నాయట. మోడీకి 2 కోట్ల 85 లక్షల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇవేకాకుండా 2 లక్ష 67 వేల విలువైన 4 బంగారు ఉంగరాలు ఉన్నాయని తెలిపారు. ఇక 9 లక్షల 12 వేలు.. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్ పథకంలో పెట్టుబడి పెట్టినట్లు మోడీ వెల్లడించారు. ప్రభుత్వం నుంచి వచ్చే జీతం, బ్యాంకు నుంచి వచ్చే వడ్డీ మాత్రమే తన ఆదాయ మార్గాలని మోడీ తెలిపారు. వీళ్లిద్దరూ దాఖలు చేసిన అఫిడవిట్‌ని బట్టి చూస్తే మోడీ కంటే రాహుల్ సూపర్ రిచ్ అని తెలుస్తోంది.