Telangana elections : వారం రోజుల్లో వంద కోట్లు సీజ్..
తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేసింది ఎలక్షన్ కమిషన్. జిల్లా బోర్డర్లలో, పట్టణాలలో ఆఖరికి గ్రామాల సరిహద్దులో కూడా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు. ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దీంతో కోటానుకోట్ల డబ్బు పట్టుబడుతోంది.
తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేసింది ఎలక్షన్ కమిషన్. జిల్లా బోర్డర్లలో, పట్టణాలలో ఆఖరికి గ్రామాల సరిహద్దులో కూడా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు. ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దీంతో కోటానుకోట్ల డబ్బు పట్టుబడుతోంది. ఎలక్షన్ కోడ్ ప్రకటించిన రోజే హైదరాబాద్ కవాడిగూడలో ఏకంగా 10 కోట్లు డబ్బు సీజ్ చేశారు అధికారులు. దాంతో పాటు 16 కిలోల బంగారం, వెండి కూడా సీజ్ చేశారు. బిల్లులు లేకపోవడంతో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి డబ్బు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఇక కొమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌లో 99 లక్షలు సీజ్ చేశారు.
కరీంనగర్‌లో ఓ వాహనం నుంచి 2 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక నల్గొండ జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచీ ఇప్పటి వరకూ మొత్తంగా 8 కోట్ల మేర డబ్బు పట్టుబడింది. ఇక కొన్ని ప్రాంతాల్లో భారీ మొత్తంలో బంగారం పట్టుబడుతోంది. చాలా ప్రాంతాల్లో మద్యాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత వారం రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 3 కోట్ల విలువ చేసే మద్యం సీజ్ చేశారు. ఎన్నికల కోసం ఈ మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకు పట్టుబడ్డ డబ్బు, బంగారం, మద్యం విలువ మొత్తం 101 కోట్లు ఉంటుందని చెప్తున్నారు పోలీసులు.
2018 ఎన్నికల సమయంలో కూడా పెద్ద మొత్తంలో డబ్బు, మద్యం స్వాధీనం చేసుకున్నారు అధికారులు. కానీ అప్పుడు మొత్తం ఎన్నికల పూర్తయ్యేలోపు ఎంత డబ్బు పట్టుబడిందో.. అంతే మొత్తం ఇప్పుడు వారంలోనే పట్టుబడింది. ఎన్నికలకు ఇంకా దాదాపు నెలన్నర సమయం ఉంది. అప్పటి లోపు ఇంకా భారీ మొత్తంలో బ్లాక్ మనీ, బంగారం, మద్యం పట్టుబడే చాన్స్ ఉందని చెప్తున్నారు పోలీసులు. ప్రతస్తుతానికి అన్ని జిల్లాల్లో కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహిస్తున్నారు. సరైన బిల్స్ లేకుండా బంగారం, నగదుతో బయటికి రావొద్దని ప్రజలకు సూచిస్తున్నారు. ఎన్నికల కోడ్ ముగిసేవరకూ పోలీసులకు సహకరించాలని కోరుతున్నారు.