గ్రూప్-3 పరీక్షలో తల్లి చంటిబిడ్డను ఆడించిన పోలీసులు
ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవరూ లేరు. ప్రతీ వ్యక్తిని తన తల్లి ప్రేమించినంతగా ఎవరూ ప్రేమించలేరు. అలాంటి తల్లి ప్రేమను అర్థం చేసుకోవడం ఇంకో మహిళకే సాధ్యం.
ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవరూ లేరు. ప్రతీ వ్యక్తిని తన తల్లి ప్రేమించినంతగా ఎవరూ ప్రేమించలేరు. అలాంటి తల్లి ప్రేమను అర్థం చేసుకోవడం ఇంకో మహిళకే సాధ్యం. పరీక్ష రాస్తున్న ఓ తల్లి బాధ్యతను తాము తీసుకుని ప్రతీ ఒక్కరి చేత శభాష్ అనిపించుకున్నారు తాండూరు మహిళా పోలీసులు. గ్రూప్-3 ఎగ్జామ్ రాసేందుకు వచ్చిన ఓ తల్లి బిడ్డను ఆ తల్లి ఎగ్జామ్ రాసేవరకూ ఆడించారు. హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లికి చెందిన కృష్ణవేణి అనే మహిళ గ్రూప్-3 ఎగ్జామ్ రాసేందుకు సింధు కాలేజీకి వెళ్లింది. అయితే కృష్ణవేణి బిడ్డను పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు పోలీసులు.
దీంతో ఏం చేయాలో కృష్ణవేణికి అర్థం కాలేదు. ఇంటికి వెళ్లిపోదాం అనుకుంటున్న సమయంలో అక్కడే ఉన్న మహిళా పోలీసులు ఏం జరిగిందని కృష్ణవేణిని అడిగారు. జరిగిన విషయం చెప్పడంతో తాము బిడ్డను చూసుకుంటా వెళ్లి పరీక్ష రాయమని భరోసా ఇచ్చారు. పోలీసులకు తన బిడ్డను ఇచ్చిన వెళ్లిన కృష్ణవేణి వెళ్లి ధైర్యంగా ఎగ్జామ్ రాసి వచ్చింది. కృష్ణవేణి బయటికి వచ్చేంత సేపు చంటిబిడ్డను ఆడించారు మహిళా పోలీసులు. ఒక్క నిమిషం కూడా ఆ చిన్నారిని ఏడవనివ్వలేదు. ఈ సీన్ అక్కడున్న ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది. ఆ మహిళా కానిస్టేబుల్స్ చేసిన పనికి ఉన్నతాధికారులు సైతం వాళ్లను అభినందించారు.