యాక్షన్ కు దిగిన బాబు.. ఐపీఎస్ కు షాక్…!
తిరుపతి ఘటనపై సర్కార్ చర్యలకు దిగింది. డీఎస్పీ రమణకుమార్, గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేసింది రాష్ట్ర ప్రభుత్వం.
తిరుపతి ఘటనపై సర్కార్ చర్యలకు దిగింది. డీఎస్పీ రమణకుమార్, గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేసింది రాష్ట్ర ప్రభుత్వం. తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు, టీటీడీ జేఈవో గౌతమి, సీఎస్వో శ్రీధర్ లను బదిలీ చేసారు చంద్రబాబు నాయుడు. తిరుపతి ఘటనపై జ్యుడిషియల్ విచారణకు ఆదేశించారు. ఇక ఈ ఘటనపై అధికారులతో చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. తొక్కిసలాట సహా జరిగిన ఘటనలపై 40 నిమిషాలకుపైగా చర్చ జరిగింది. టీటీడీ ఉన్నతాధికారుల తీరుపై చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేసారు.