అమ్మో జ్వరం… వణుకుతున్న వరంగల్
వరంగల్ నగరంలో వైరల్ ఫీవర్లు అక్కడి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. వరంగల్ నగరంలోనే ఈ ఫీవర్ల ప్రభావం ఎక్కువగా ఉంది. జ్వరంతో ఆసుపత్రులకు నగరవాసులు క్యూ కడుతున్నారు.
వరంగల్ నగరంలో వైరల్ ఫీవర్లు అక్కడి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. వరంగల్ నగరంలోనే ఈ ఫీవర్ల ప్రభావం ఎక్కువగా ఉంది. జ్వరంతో ఆసుపత్రులకు నగరవాసులు క్యూ కడుతున్నారు. ఆదివారం అయినప్పటికీ ఆసుపత్రి బాట పడుతున్నారు జ్వర బాధితులు. ఫీవర్ ఆసుపత్రి లో నిన్న ఒక్కరోజు 560 ఒపిలు నమోదు అయ్యాయి. సోమవారం 1000 వరకు ఒపి ఉంటుంది అని అంచనా వేస్తున్నారు.
జ్వరం తో ఫీవర్ ఆసుపత్రి లో అడ్మిట్ అవుతున్నారు. ప్రస్తుతం 80 వరకు ఇన్ పేషంట్స్ ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఆసుపత్రి కేపాసిటి 300 బెడ్స్ కావడంతో కేసులు పెరిగితే ఏం చేయాలనే దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎక్కువగా వైరల్ ఇన్ఫెక్షన్ తో బాధితులు వస్తున్నారు. జ్వరం, జలుబు, ఒళ్ళు నొప్పులతో ఆసుపత్రులకు ప్రజలు క్యూ కడుతున్నారు.