రతన్ టాటాకు ఏపీ సర్కార్ ఘన నివాళి
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాకు ఘన నివాళి అర్పించేందుకు ఏపీ సర్కార్ సిద్దమైంది. రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయనున్న ఇన్నోవేషన్ హబ్ కు రతన్ టాటా పేరు పెడుతూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.

ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాకు ఘన నివాళి అర్పించేందుకు ఏపీ సర్కార్ సిద్దమైంది. రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయనున్న ఇన్నోవేషన్ హబ్ కు రతన్ టాటా పేరు పెడుతూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఎక్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు పోస్ట్ చేసారు. రతన్ టాటాకు నివాళిగా అమరావతిలో ఏర్పాటు చేయనున్న ఇన్నోవేషన్ హబ్ కు ఆయన పేరు పెడుతున్నామని ప్రకటించారు.
స్టార్టప్ లకు మెంటార్ గా వ్యవహరించనున్న ఇన్నోవేషన్ హబ్ పెట్టుబడుల ప్రోత్సాహక ఎకో సిస్టమ్ ను కల్పిస్తుందని పేర్కొన్న సీఎం… రాష్ట్రంలోని ఇతర ఐదు జోనల్ కేంద్రాలకు అనుసంధానంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఉంటుందని తెలిపారు. ప్రముఖ వాణిజ్య సంస్థలు, గ్రూప్ ల పర్యవేక్షణలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఆయా రంగాల్లో సాంకేతికత, నైపుణ్యాలకు కేంద్రంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు తెలిపారు.