విశ్వరూప్ కొడుకు చేసిన హత్య, మర్డర్ వెనుక సీక్రెట్స్

రెడ్ బుక్... రక్త చరిత్రను తవ్వుతోంది. గత అయిదేళ్ళ కాలంలో ఏపీలో జరిగిన అక్రమాలు, అవినీతి, కూనీలను బయటకు లాగోతోంది. విపక్షాలు రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణించినా ఏపీలో ఒక్కొక్కరికి గురిపెట్టి కొడుతోంది రెడ్ బుక్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 21, 2024 | 06:52 PMLast Updated on: Oct 21, 2024 | 6:52 PM

The Murder Of Vishwarups Son The Secrets Behind The Murder

రెడ్ బుక్… రక్త చరిత్రను తవ్వుతోంది. గత అయిదేళ్ళ కాలంలో ఏపీలో జరిగిన అక్రమాలు, అవినీతి, కూనీలను బయటకు లాగోతోంది. విపక్షాలు రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణించినా ఏపీలో ఒక్కొక్కరికి గురిపెట్టి కొడుతోంది రెడ్ బుక్. మొన్న నందిగం సురేష్, నిన్న బోరుగడ్డ అనీల్, నేడు పినిపే శ్రీకాంత్. ఇలా ఒక్కొక్కరిని బయటకు లాగి బొక్కలో తోస్తోంది. తాజాగా మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ కుమారుడు పినిపే శ్రీకాంత్ ను పోలీసులు తమిళనాడులో అరెస్ట్ చేసి ట్రాన్సిట్ వారెంట్ పై ఏపీకి తీసుకొచ్చారు.

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రెండున్నరేళ్ల క్రితం వాలంటీర్ గా విధులు నిర్వహించే దళిత యువకుడు జనుపల్లి దుర్గాప్రసాద్‌ ను హత్య కేసును ఏపీ పోలీసులు చేధించి శ్రీకాంత్ ను నిందితుడిగా గుర్తించారు. పినిపే శ్రీకాంత్‌ తో పాటుగా ఈ హత్యలో పలువురికి భాగస్వామ్యం ఉందని గుర్తించారు. హత్య జరిగిన సమయంలో మృతిడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం కావడంతో… కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసులు విచారణ వేగవంతం చేసారు. రమేష్ అనే వ్యక్తిని పోలీసులు విచారించగా శ్రీకాంత్ పేరు బయటకు వచ్చింది. ఈ కేసులో తమిళనాడులోని మధురైలో తలదాచుకున్న శ్రీకాంత్‌ను పోలీసులు గాలించి అరెస్ట్ చేసారు. అక్కడి న్యాయమూర్తి ముందు హాజరుపరిచి ట్రాన్సిట్‌ వారెంట్‌పై ఏపీకి తీసుకొచ్చారు.

హత్య ఎలా జరిగింది…?

ఏపీలో గత ప్రభుత్వం కొత్త జిల్లాలను ప్రకటించింది ఆ సమయంలో కోనసీమ ప్రాంతానికి అంబేడ్కర్‌ పేరు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. అప్పుడు పెద్ద ఎత్తున అల్లర్లు జరగగా… అదే సమయంలో వాలంటీరు దుర్గాప్రసాద్‌ ను 2022 జూన్‌ 6న హత్య చేసారు. అప్పుడు కేసు నమోదు చేసిన పోలీసులు ఉప్పలగుప్తం మండలానికి చెందిన, వైసీపీ సోషల్‌ మీడియా కన్వీనర్, మృతుడికి స్నేహితుడైన రమేష్‌ పోలీసులు అనుమానంతో విచారించారు. హత్య కేసులో అక్టోబర్ 18న రమేష్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు విచారణ సమయంలో మరో నలుగురు నిందితులతో పాటుగా… పినిపె శ్రీకాంత్‌ కూడా ఉన్నట్టు గుర్తించారు. దుర్గాప్రసాద్… శ్రీకాంత్‌‌తో కలిసి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు అని స్థానికులు చెప్తున్నారు. అదే సమయంలో తన కుటుంబ సభ్యులకు దుర్గాప్రసాద్ అసభ్యకరమైన మెసేజ్ లు పెడుతున్నాడని గుర్తించి, శ్రీకాంత్… అతని హత్యకు ప్లాన్ చేసి… రమేష్ సహాయంతో మరో నలుగురిని కలుపుకుని హత్య బాధ్యతలు అప్పగించాడని గుర్తించారు. దీనితో శ్రీకాంత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే తన కుమారుడ్ని కావాలనే కేసులో ఇరికించారు అంటూ పినిపే విశ్వరూప్ ఆరోపించారు.