Pravilikas suicide : ప్రవళిక బాయ్ ఫ్రెండ్ అరెస్ట్.. ఏం చెప్పాడంటే..
తెలంగాణలో ప్రవళిక ఆత్మహత్య కేసు రేపిన రచ్చ అంతా ఇంతా కాదు. ప్రభుత్వం వర్సెస్ ప్రతిపక్షం అనే రేంజ్‌లో యుద్ధం సాగింది. ప్రేమ విఫలం అయ్యే ప్రవలిక ఆత్మహత్య చేసుకుందని పోలీసులు అంటే.. అసలు ఆమె గ్రూప్స్‌కు కూడా అప్లై చేసినట్లు సమాచారం కూడా లేదంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మరింత రచ్చరేపాయి. ఐతే అదే కేటీఆర్.. ప్రవళిక కుటుంబసభ్యులను కలిసి.. ఆమె తమ్ముడికి ఉద్యోగం హామీ ఇవ్వడంతో.. వ్యవహారం మరింత హీటెక్కింది.
ప్రవళిక కేసులో కొత్త ట్విస్ట్..
తెలంగాణలో ప్రవళిక ఆత్మహత్య కేసు రేపిన రచ్చ అంతా ఇంతా కాదు. ప్రభుత్వం వర్సెస్ ప్రతిపక్షం అనే రేంజ్‌లో యుద్ధం సాగింది. ప్రేమ విఫలం అయ్యే ప్రవలిక ఆత్మహత్య చేసుకుందని పోలీసులు అంటే.. అసలు ఆమె గ్రూప్స్‌కు కూడా అప్లై చేసినట్లు సమాచారం కూడా లేదంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మరింత రచ్చరేపాయి. ఐతే అదే కేటీఆర్.. ప్రవళిక కుటుంబసభ్యులను కలిసి.. ఆమె తమ్ముడికి ఉద్యోగం హామీ ఇవ్వడంతో.. వ్యవహారం మరింత హీటెక్కింది. ఇలాంటి పరిణామాల మధ్య ప్రవళిక కేసులో భారీ ట్విస్ట్ చోటుచేసుకుంది. నిందితుడు, ప్రవళిక బాయ్ ఫ్రెండ్ శివరాం ను పోలీసులు అరెస్ట్ చేశారు. పుణెలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రవళిక ఘటన తర్వాత శివరాం పరారయ్యాడు. ఫోన్ నెంబర్ మార్చి తప్పించుకుని తిరుగుతున్నాడు. కొత్త ఫోన్ నెంబర్ ఆధారంగా పోలీసులు అతడిని ట్రేస్ చేశారు. పుణెలో ఉన్నట్లు గుర్తించారు.
శివరాం ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. ఐతే పోలీసుల విచారణలో శివరాం ఎలాంటి విషయాలు బయట పెడతాడు అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రవళిక ఆత్మహత్య ఘటన తెలంగాణలో సంచలనం రేపింది. రాజకీయ రంగు పులుముకుంది. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ప్రవళిక లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాద్ అశోక్ నగర్‌లోని హాస్టల్లో ఉంటూ పోటీ పరీక్షల కోసం కోచింగ్ తీసుకుంది. అక్టోబర్ 13న హాస్టల్ గదిలోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గ్రూప్2 పరీక్ష రద్దు చేయడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఆరోపించారు. ప్రవళిక ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ఐతే పోలీసుల వెర్షన్ మరోలా ఉంది. ప్రవళిక ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారం కారణం అని తేల్చారు. శివరాం వేధింపుల వల్లే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందన్నారు.
ప్రవళిక ఘటనలో పోలీసులు ఆమె బాయ్‌ఫ్రెండ్ శివరాంపై కేసు నమోదు చేశారు. ప్రవళిక ఆత్మహత్యకు వ్యక్తిగత కారణాలే కారణమని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో ఆధారాలు సేకరించారు. ప్రవళిక ఆత్మహత్య వ్యవహారం రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర దుమారం రేపింది. దీనిపై రాజకీయ పార్టీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేశాయి. ప్రభుత్వ నిర్వాకం వల్లే యువతి ప్రాణాలు కోల్పోయిందని ఆరోపించాయి. ప్రవళిక బలవన్మరణంపై రాజకీయ పార్టీలు చేసిన ఆరోపణలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దీనిపై ఆందోళన చేసిన 13మంది రాజకీయ నాయకులపై కేసులు నమోదు చేశారు చిక్కడపల్లి పోలీసులు. రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, అనిల్ కుమార్ యాదవ్, ఫిరోజ్ ఖాన్, కార్పొరేటర్ విజయారెడ్డి, ఓయూ నేత సురేశ్ యాదవ్, భాను ప్రకాశ్, నీలిమ, జీవన్‌పై కేసులు నమోదయ్యాయి.