TDP, Jana Sena, JAC Meeting : నేడు టీడీపీ – జనసేన జేఏసీ రెండో సమావేశం.. మేనిఫెస్టో రూపకల్పనపై క్లారిటీ వచ్చే అవకాశం..!
ఇవాళ జనసేన - టీడీపీ జేఏసీ రెండో సమావేశం జరిగింది. ఇవాళ ఉదయం 11:30 గంటలకు జేఏసీ సభ్యులు సమావేశం కానున్నారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఇప్పటికే టీడీపీ (TDP) – జనసేన (Jana Sena) రాబోయే ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు పొత్తు కుదుర్చుకున్నాయి. ఇవాళ జనసేన – టీడీపీ జేఏసీ రెండో సమావేశం జరిగింది. ఇవాళ ఉదయం 11:30 గంటలకు జేఏసీ సభ్యులు సమావేశం కానున్నారు. ఈ సారి కలిసి పోటీ చేస్తున్నందునా.. పూర్తిస్దాయి మేనిఫోస్టో రూపకల్పన అంశాలే ప్రధాన అజెండాగా ఈ సమావేశం జరుగుతుంది. మేనిస్టో రూపకల్పన.. ప్రకటన లోపు ఇరు పార్టీలు ఉమ్మడిగా కార్యచరణ దిశగా ప్రజల్లో ఐక్యంగా వేళ్లేందుకు ఓ కరపత్రం రూపొందించాలని నిర్ణయం తీసుకున్నాయి. ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై నేటి సమావేశంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఇక ప్రధానంగా ఓటరు లిస్టు (Voter List) అవకతవకలపై గతంలో జాతీయ స్థాయిలో పోరాటం చేయాలని టీడీపీ పీఏసీ సమావేశంలో విషయం తెలిసిందే.. ప్రజా సమస్యలపై , జగన్ సర్కార్ దోపిడీ.. క్షేత్రస్థాయిలో ఉమ్మడి పోరాటానికి కార్యాచరణ రూపకల్పన చేయాలని పీఏసీ భావించింది. ఇక రాష్ట్రంలో మద్యం, ధరలు, కరెంట్ చార్జీల పెంపు, ఇసుక, కరువు వంటి ప్రధాన అంశాలపై ప్రజల్లోకి వెళ్లేలా ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి టీడీపీ – జనసేన. ఇక ప్రజలకు మరింత దగ్గర కావాలనే ఆలోచనతో నియోజకవర్గాల వారీగా ఆత్మీయ సమావేశాలు నిర్వహించేలా జేఏసీలో (JAC Meeting) ప్రతిపాధించాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై, ప్రజా సమస్యలు ఎత్తి చూపిస్తూ ఐక్య పోరాటానికి 100 రోజుల ప్రణాళికను జనసేన – టీడీపీ పార్టీలు సిద్ధం చేసుకుంటూన్నాయి.