AP elections CM Jagan: జగన్ చేసిన ఏడో తప్పు… బాబాయ్ కేసుతో బజారున పడ్డ పరువు..
2019లో జగన్ బాబాయ్.. వివేకాను హత్య (Viveka's murder) చేశారు. ఆ ఎన్నికల్లో ఈ హత్యని బాగా వాడుకున్నారు జగన్(Jagan). చంద్రబాబే ఈ హత్య చేయించాడని ప్రచారం చేశారు. ఆ తర్వాత ఐదేళ్లలో... ఆ హత్య కేసులో జగన్ ఆయన కుటుంబం అబాసుపాలైంది. జగన్ సోదరుడు అవినాష్ రెడ్డి(Avinash Reddy)... ఈ కేసులో నిందితుడిగా ఉన్నాడు.
2019లో జగన్ బాబాయ్.. వివేకాను హత్య (Viveka’s murder) చేశారు. ఆ ఎన్నికల్లో ఈ హత్యని బాగా వాడుకున్నారు జగన్(Jagan). చంద్రబాబే ఈ హత్య చేయించాడని ప్రచారం చేశారు. ఆ తర్వాత ఐదేళ్లలో… ఆ హత్య కేసులో జగన్ ఆయన కుటుంబం అబాసుపాలైంది. జగన్ సోదరుడు అవినాష్ రెడ్డి(Avinash Reddy)… ఈ కేసులో నిందితుడిగా ఉన్నాడు. అవినాష్ తండ్రిని కూడా ఈ కేసులో అరెస్ట్ చేశారు. వివేకాకి సన్నిహితుడైన దస్తగిరి.. తానే ఈ హత్య చేశానని అప్రూవర్‌గా మారాడు. ఆయన అవినాష్ రెడ్డిపై ఆరోపణలు చేశాడు. రకరకాల ప్రయత్నాలతో అవినాష్ రెడ్డి జైలుకి వెళ్లకుండా తప్పించుకున్నాడు. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నాడు.
వివేకా గుండెపోటుతో చనిపోయాడని ఒకసారి… లేదు లేదు హత్య జరిగిందని మరోసారి… ఇలా రకరకాలుగా లీకులిచ్చి జగన్ చుట్టూ ఉన్న కోటరీ అడ్డంగా బుక్ అయింది. టీడీపీ (TDP) సోషల్ మీడియా వివేకా హత్యను ఒకటికి పదింతలు చేసింది. మరో సోదరి సునీతా రెడ్డి… జగన్, అవినాష్‌కు వ్యతిరేకంగా కోర్టులో పోరాడుతోంది. దీంతో ఇంటిగుట్టు రచ్చకెక్కింది. ఈ కేసు సీబీఐ (CBI) చేతుల్లోకి వెళ్లినా ఎటూ తేలింది లేదు. జగన్‌ను, అవినాశ్‌ను.. కేంద్రంలోని మోదీ సర్కారే కాపాడుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయ్. ఐతే వివేకా హత్యకు కారణాలేంటి.. హత్య వెనక ఎవరున్నారన్నది తేలకపోయినా.. కేసు ప్రభావం మాత్రం కచ్చితంగా జగన్ గెలుపోటములపై ఉంటుంది. జగన్ కుటుంబ సంస్కృతిపై… జనం అసహ్యం పెంచుకునేలా వివేక హత్య పబ్లిక్‌లోకి వెళ్లిపోయింది.