దేశాన్ని కుదిపేస్తున్న సె*క్స్ స్కాండల్, హనీట్రాప్ లో చిక్కుకున్న రాజకీయ నేతల్లో వణుకు

దేశ రాజకీయాల్లో కర్ణాటక హనీట్రాప్...ప్రకంపనలు రేపుతోంది. ఒకరు కాదు...ఇద్దరు కాదు..ఏకంగా 48 మంది నేతలు...వీరంతా సామాన్యులేం కాదు. ప్రజాప్రతినిధులు. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిర్లు, కార్పొరేటర్లు అనుకుంటే పొరపాటే.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 22, 2025 | 12:11 PMLast Updated on: Mar 22, 2025 | 12:11 PM

The Sex Scandal That Is Shaking The Country Political Leaders Caught In The Honeytrap Are Trembling

దేశ రాజకీయాల్లో కర్ణాటక హనీట్రాప్…ప్రకంపనలు రేపుతోంది. ఒకరు కాదు…ఇద్దరు కాదు..ఏకంగా 48 మంది నేతలు…వీరంతా సామాన్యులేం కాదు. ప్రజాప్రతినిధులు. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిర్లు, కార్పొరేటర్లు అనుకుంటే పొరపాటే. వలపువలలో చిక్కుకున్న వారంతా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. అదర్శంగా ఉండాల్సిన నేతలు అడ్డంగా ఇరుక్కుపోయారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కర్ణాటక నేతలు హనీట్రాప్ లో చిక్కుకోవడం దుమారం రేపుతోంది.

హనీట్రాప్…దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కర్ణాటక రాజకీయాల్లో పెనుదుమారం రేపుతోంది. వలపువలలో ప్రముఖ రాజకీయ నేతలు ఉన్నారని మంత్రి రాజన్న వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఆయనేం సామాన్య రాజకీయ నేత కాదు…కర్ణాటక సహాకార మంత్రి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. 48 మంది పొలిటిషియన్లు ఉన్నారని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా అన్ని పార్టీల నేతలు వలపువలలో ఇరుక్కుపోయారన్న కామెంట్స్…పొలిటిషియన్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. హనీట్రాప్ పై కర్ణాటక సర్కార్ విచారణకు ఆదేశించింది. దీంతో ఎప్పుడు ఎవరి పేరు బయటికి వస్తుందోనన్న భయంత ప్రజాప్రతినిధులు వణికిపోతున్నారు. హనీట్రాప్ అని తెలిసి కూడా కొందరు నేతలు…ఆ ఊబిలో చిక్కుపోతున్నారు. తర్వాత బ్లాక్ మెయిలింగ్ కు నలిగిపోతారు. బేరాలు కుదరక వీడియోలు బయటకు వస్తే పరువు మొత్తం పోతుంది.

అసలే మంత్రులు…ఎమ్మెల్యేలు…ఎమ్మెల్సీలు…ప్రజాప్రతినిధులుగా బాధ్యత ఉండక్కర్లే. ఎంత జాగ్రత్తగా ఉండాలి. ప్రతిక్షణం అలర్ట్ గా ఉండాలి. ఏ చిన్న కారణం దొరికినా..రాజకీయ ప్రత్యర్థులకు చిక్కిపోతారు. నేతల వేసే ప్రతి అడుగును…ప్రత్యర్థులు గమనిస్తుంటారు. ఓ కన్ను వేసే ఉంటారు. దొరికితే జనం ముందు ఇజ్జత్ తీయాలని చూస్తారు. పరువును బజారు పాలు చేయాలని గుంటనక్కల్లా కాచుకొని కూర్చొంటారు. కొన్ని సందర్బాల్లో కావాలనే ఇరికించడానికి అమ్మాయిలను వల వేస్తారు. ఏ కొంచెం దూల ఉన్న రాజకీయ నేతలెవరైనా…కొతికి దొరికింది కొబ్బరి చిప్ప అన్నట్లు వ్యవహరిస్తారు. అసలే ఇదే సోషల్ మీడియా యుగం. ఇంత దాన్ని అంత చేసే కాలం. కర్ణాటకలోనూ ఇప్పుడు అదే జరిగింది. ప్రముఖులనే టార్గెట్ చేస్తూ.. కొందరు మహిళలు వలపు వల విసిరారు. నగ్నంగా వీడియోకాల్ చేసి​ కవ్వించారు. అమ్మాయి కదా…పురుష పుంగవులు రెచ్చిపోయారు. వారితో తతంగం నడిపి…ఇప్పుడు పీకల్లోతు మునిగిపోయారు. ఇప్పుడు ఎలా బయటకు రావాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పుడు ఎలాంటి వీడియోలు బయటకు రాకపోయినా…భవిష్యత్ ఓ వస్తాయన్న భయంతో వణికిపోతున్నారు.

కర్ణాటకలో హనీట్రాప్ వ్యవహారాలు కొత్తేమీ కాదు. ఇక్కడ వలపువలకు చిక్కి…గిలగిల కొట్టుకున్న వారు ఎందరో ఉన్నారు. అక్కడ ఆ కుట్రలన్నీ హనీట్రాప్ కేంద్రంగానే సాగుతాయి. గతంలో మంత్రిగా పని చేసిన రమేశ్ జార్ఖిహోళి…ఓ అమ్మాయితో హోటల్ గడిపిన వీడియో…అప్పట్లో దుమారం రేపింది. ఆ తర్వాత రమేశ్ జార్ఖిహోలి మంత్రి పదవిని కోల్పోయారు. ఆయన ఒక్కడే కాదు. మాజీ మంత్రి రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణ కూడా ఇలాగే బుక్కయ్యాడు. అతగాడి పెన్ డ్రైవ్ లో వందల వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఎంతో మంది నేతలు ఈ హనీ ట్రాప్‌ లో పడి.. వీడియోలు రిలీజ్ అయిన తర్వాత ముఖం చూపించుకోలేక ఇబ్బంది పడ్డారు. అయినా నేతల రాజకీయ జీవితానికి ఎలాంటి ఇబ్బంది రాలేదు. కొంత మంది శాసనసభ్యులు..అసెంబ్లీలోనే నీలిచిత్రాలు చూస్తూ దొరికిపోయారు. ఇప్పుడు మళ్లీ తాము హనీ ట్రాప్ లో చిక్కుకున్నామని వారు ఆందోళన చెందుతున్నారు. ఏకంగా అసెంబ్లీలోనే దీనిపై చర్చ పెట్టుకున్నారు. కర్ణాటక శాసనసభ్యులకు మాత్రం హనీ ట్రాప్ అనేది.. ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. ఓ భూతంగా వెంటాడుతోంది. రాబోయే రోజుల్లో కొన్ని కీలక వీడియోలు వైరల్ అయినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. కర్ణాటక ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో ఎవరి బాగోతం బయట పడుతుంది ? జనంలో అబాసుపాలు అయ్యేది ఎవరు ? హనీట్రాప్ లో చిక్కుకున్న నేతలెవరు అన్న దానిపై ఉత్కంఠ రేపుతోంది.