నాగబాబు కేబినేట్ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్…!
ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఏపీ కేబినేట్ లో మార్పులు చేర్పులకు కూటమి ప్రభుత్వం సిద్దమైంది. ఉగాది తర్వాత ఏపీ కేబినెట్ లో మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.

ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఏపీ కేబినేట్ లో మార్పులు చేర్పులకు కూటమి ప్రభుత్వం సిద్దమైంది. ఉగాది తర్వాత ఏపీ కేబినెట్ లో మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ముఖ్యంగా జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ఏపీ కేబినేట్ లో ఎప్పుడు అడుగు పెడతారు అనే దానిపై రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. నాగబాబు విషయంలో కూటమి ఓ అంగీకారానికి రావడంతో ఆయనను కేబినేట్ లోకి తీసుకోవడం ఖరారు అయిందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
అయితే ఇప్పుడు వస్తున్న కథనాల ప్రకారం.. ఏప్రిల్ 4న కేబినెట్ లోకి నాగబాబు ఎంట్రీ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటీవల జనసేన నుంచి ఎమ్మెల్సీగా నాగబాబును కూటమి ఎంపిక చేసింది. నాగబాబును కేబినెట్ లోకి మార్చ్ నెలలో తీసుకుంటామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ప్రస్తుతం ఏపీ మంత్రి వర్గంలో ఓ శాఖ ఖాళీగా ఉంది. ఇక నాగబాబును కేబినేట్ లోకి తీసుకునే సమయంలో శాఖల్లో మార్పులు చేసే అవకాశం కనపడుతోంది. నాగబాబుకు రెండు శాఖలను కేటాయించనున్నట్టు తెలుస్తోంది. ఆయనకు క్రీడా శాఖతో పాటుగా టూరిజమ్ కూడా అప్పగించే అవకాశం ఉందని సమాచారం. కొత్త మంత్రి కావడంతో ఒత్తిడి తక్కువగా ఉండే శాఖలను ఆయనకు కేటాయించనున్నారట. ప్రస్తుతం క్రీడా శాఖ మండిపల్లి రాంప్రసాదరెడ్డి వద్ద ఉండగా.. టూరిజం కందుల దుర్గేష్ వద్ద ఉంది.