ముగిసిన కేటిఆర్ విచారణ, డీసీపీతో కేటిఆర్ గొడవ
ఫార్ములా ఈ కార్ రేస్ కేస్ లో మాజీ మంత్రి కేటిఆర్ విచారణ ముగిసింది. కేటిఆర్ ను దాదాపు ఆరు గంటల పాటు అధికారులు విచారించారు. ఫిర్యాదు దారుడు దాన కిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా విచారణ కొనసాగింది.
ఫార్ములా ఈ కార్ రేస్ కేస్ లో మాజీ మంత్రి కేటిఆర్ విచారణ ముగిసింది. కేటిఆర్ ను దాదాపు ఆరు గంటల పాటు అధికారులు విచారించారు. ఫిర్యాదు దారుడు దాన కిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా విచారణ కొనసాగింది. ఐఏఎస్ అరవింద్ కుమార్ ఇచ్చిన వాగ్మూలం ముందు ఉంచి అధికారులు ప్రశ్నించారు. FEO తో ఒప్పందాలు నగదు,బదిలీ అంశాలపై ప్రశ్నించారు. క్యాబినెట్ ఆమోదం, ఆర్ధిక శాఖ అనుమతి లేకుండా ఎందుకు నగదు బదిలీ చేశారు అని నిలదీశారు అధికారులు.
ఫార్ములా ఈ కార్ రేస్ నుంచి గ్రీన్ కో తప్పుకోవడానికి కారణం ఏంటి? అని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోళ్లపై కూడా ప్రశ్నించారు. ఇప్పటికే సేకరించిన పత్రాలు ముందు ఉంచి పలు ప్రశ్నలు అడిగారు. ఏసీబీ ఆఫిస్ బయట మీడియాతో మాట్లాడిన కేటీఆర్ ను వెస్ట్ జోన్ డీసీపీ అడ్డుకున్నారు. దీనితో కాసేపు వాగ్వాదం జరిగింది. మీడియా సమావేశం కావాలంటే మీ పార్టీ ఆఫీస్ లో పెట్టుకోవాలని పోలీసులు సూచించడంతో కేటిఆర్ పార్టీ ఆఫీసుకు వెళ్ళిపోయారు.