33% women reservation : బీఆర్ఎస్ లిస్ట్ మారబోతోందా ..?
మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో మరో సంచలన నిర్ణయం తీసుకుంది. చట్ట సభల్లో మహిళలు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది.

The Union Cabinet has decided to introduce a bill in Parliament to provide 33 percent reservation for women in legislative assemblies
కేంద్రం సంచలన నిర్ణయం.. బీఆర్ఎస్ సిట్టింగ్ టికెట్ లో మార్పులు..!
చట్టసభల్లో 33% మహిళలకు రిజర్వేషన్..
మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో మరో సంచలన నిర్ణయం తీసుకుంది. చట్ట సభల్లో మహిళలు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. దేశం గర్వించదగ్గ ఈ నిర్ణయంతో తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు రానున్నాయి. ఈ బిల్ పాసైతే అన్ని రాష్ట్రాల్లో శాసనసభల్లో 33 శాతం సీట్లు మహిళలకు కేటాయించాలి. తెలంగాణలో ఇప్పటికే బీఆర్‌ఎస్ తన లిస్ట్‌ను రిలీజ్ చేసింది. 33 శాతం కాదు కదా కనీసం 10 మంది మహిళలకు కూడా కేసీఆర్ ఎమ్మెల్లే టికెట్లు కేటాయించలేదు. కానీ ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయంతో పరిస్థితి మారబోతున్నట్టు కనిపిస్తోంది.
బీఆర్ఎస్ పార్టీ కొత్త లిస్ట్ రెడీ చేయాల్సిందేనా.. ?
బిల్లు పాసైతే బీఆర్‌ఎస్ పార్టీ కొత్త లిస్ట్ రెడీ చేయాల్సి ఉంటుంది. 30 నుంచి 40 స్థానాలు మహిళలకు కేటాయించాల్సి ఉంటుంది. ప్రస్తుతం బీఆర్‌ఎస్ పార్టీ కనీసం 10 మందికి కూడా ఎమ్మెల్యే టికెట్లు కేటాయించలేదు. కానీ ఇప్పుడు కేంద్ర తీసుకున్న నిర్ణయంతో బీఆర్‌ఎస్ లిస్ట్ మరోసారి ప్రపేర్ చేయడం తప్పేలా లేదు. కేంద్ర నిర్ణయంతో తెలంగాణలో మరోసారి ఆశావహుల్లో కొత్త ఆశలు పుట్టుకొచ్చాయి. మహిళా రిజర్వేషన్‌లో టికెట్ తెచ్చుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. బిల్లు పాసైన తరువాత బీఆర్‌ఎస్ లిస్ట్‌లో జరిగే మార్పులేంటో చూడాలి.