గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు రాజమండ్రి రోజు తిరిగి వస్తు రంగంపేట దగ్గర ప్రాణాలు విడిచిన మెగా అభిమానులు చరణ్, మణికంఠ తల్లిదండ్రులు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసారు. ఉదయం 7 గంటలకు పవన్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కలుస్తారని రెవెన్యూ అధికారులు సభా ప్రాంగణం వద్దకు తీసుకుని వెళ్ళారు. పవన్ కళ్యాణ్ ప్రసంగం ముగిసినప్పటికీ తిరుపతి మృతుల కోసం మాట్లాడిన పవన్ కళ్యాణ్ మా కుటుంబంలో వ్యక్తులు మృతిచెందితే ఎందుకు మాట్లాడరని బాధితులు నిలదీశారు. మా కుటుంబంలో చనిపోయిన వ్యక్తులు మనుషులు కారా బాధ ఎవరికైనా బాధే అంటూ విలపించారు. పవన్ కళ్యాణ్ సాయం చేస్తారని కాదు ఓదార్చుతారని తమను తీసుకువచ్చి రెండు నిమిషాల సమయం ఇవ్వకపోవడం చాలా బాధాకరం అన్నారు. నా కొడుకు మృతికి పవన్ కళ్యాణ్ కనీసం సంతాపం చెప్పలేదు... నేను కూడా నా కొడుకు అలాగే చనిపోతాను అంటూ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.