అలా రిమాండ్ విధించిన చాలామంది నాయకులు బయటకు రావడానికి నానా కష్టాలు పడుతున్నారు. చాలామంది ఇంకా బయటకు కూడా రాలేదు. ఇప్పుడు ఈ 14 రోజుల రిమాండ్ తో జైలుకు వెళ్లిన చాలామంది ఇంకా జైల్లోనే గడుపుతున్నారు. వాళ్ళ లిస్టు ఒకసారి చూస్తే... వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. ఆ 14 రోజుల రిమాండ్ తర్వాత ఆయనకు రిమాండ్ పెరుగుతూ వచ్చింది. దాదాపు రెండు నెలల తర్వాత ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. ఆ తర్వాత బయటకు వచ్చి మాట్లాడాలంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భయపడిపోతున్నారు. అలాగే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన కొంతమంది వైసిపి కార్యకర్తలకు 14 రోజుల రిమాండ్ విధించారు. కళ్ళం హరికృష్ణ రెడ్డి, రవి కిరణ్, పెద్దిరెడ్డి సుధారాణి, వర్రా రవీంద్రారెడ్డి... వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ వెంకటరామిరెడ్డి ఇలా చాలామంది 14 రోజుల రిమాండ్ తో జైలుకు వెళ్లి ఇంకా బయటికి రాలేదు. ఇటీవల పెద్దిరెడ్డి సుధారాణి బయటకు వచ్చింది. కళ్ళం హరికృష్ణ రెడ్డి బయటకు వచ్చి సంబరాలు చేసుకున్నాడనే కారణంతో జైలుకు తరలించారు. ఆ తర్వాత అతనికి 14 రోజుల రిమాండ్ విధించారు. ప్రస్తుతం అతను జైల్లోనే ఉన్నాడు. ఇక వైసిపి మాజీ ఎంపీ నందిగం సురేష్ ను టిడిపి కార్యాలయం పై దాడి కేసులో అదుపులోకి తీసుకున్నారు. అతనికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆ తర్వాత నందిగం సురేష్ జైలు నుంచి బయటకు రాలేదు. కేసులు పై కేసులు పెడుతూ అతని జైల్లోనే ఉంచుతున్నారు. మరియమ్మ అనే దళిత మహిళ హత్య కేసులో నందిగం సురేష్ జైలుకు వెళ్ళాడు. దీనికి సంబంధించి అతను సుప్రీంకోర్టులో కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సరే ఇప్పటి వరకు బెయిల్ రాలేదు. ఆయన ఎప్పుడు బయటకు వస్తాడో కూడా తెలియని పరిస్థితి. ఇక బోరుగడ్డ అనిల్ కుమార్ విషయానికి వస్తే అతన్ని కూడా 14 రోజుల రిమాండ్ తో ముందు జైలుకు తరలించారు. ఆ తర్వాత పలు కేసులు కూడా అతనిపై నమోదు అయ్యాయి. అన్ని కేసుల్లో అతనికి 14 రోజులు రిమైండ్ విధిస్తూ వస్తున్నారు. ఒక కేసు తర్వాత మరొక కేసులో అతని అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అతనిపై కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. అతను కూడా 14 రోజుల రిమాండ్ తో జైలుకు వెళ్లి ఇంకా జైల్లోనే ఉన్నాడు. ఇటీవల ఏపీ హైకోర్టు కూడా అతనికి బెయిల్ నిరాకరించింది. అతను కొన్నాళ్లపాటు జైల్లో ఉండటమే మంచిది అంటూ కోర్టు కూడా అభిప్రాయబడింది. అలాగే వైసిపి నేత సుదర్శన్ రెడ్డికి కూడా 14 రోజుల రిమాండ్ విధించారు. ఇటీవల ఎంపీడీవో పై దాడి కేసులో నిందితులుగా సుదర్శన్ రెడ్డి, వెంకటరెడ్డి, బయ్యా రెడ్డికి రిమాండ్ విధించారు. గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబు పై ముగ్గురు నిందితులు దాడి చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఏకంగా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కడప వెళ్లి మరీ బాధిత కుటుంబానికి మద్దతు ప్రకటించారు. ఇక ఇటీవల కృష్ణా జిల్లా గుడివాడ వైసీపీ నేతలకు కూడా ఇలాగే రిమాండ్ విధించారు. వాళ్లు కూడా బయటకు రావడం లేదు. కొడాలి నాని ప్రధాన అనుచరుడు ప్రస్తుతం జైల్లోనే 14 రోజుల రిమాండ్ తో బయటకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక తాజాగా మాచర్ల కు చెందిన తురక కిషోర్ అలాగే తురక శ్రీకాంత్ ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. వాళ్ళిద్దరికీ కూడా 14 రోజుల రిమాండ్ విధించింది కోర్ట్. మాచర్ల కోర్ట్ లో హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించడంతో వాళ్ళిద్దరిని గుంటూరు జైలుకు భారీ భద్రత నడుమ తరలించారు. 2022లో మాచర్ల టిడిపి కార్యాలయాన్ని తగలబెట్టిన కేసులో కిషోర్ తో పాటు అతని సోదరుడిపై కేసులు నమోదు అయ్యాయి. దీనితో అప్పటినుంచి అతను పరారీలోనే ఉన్నాడు. ఇటీవల హైదరాబాదులో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇలా 14 రోజుల రిమాండ్ పేరుతో జైలుకు వెళ్లిన చాలామంది వైసిపి కార్యకర్తలు, నాయకులు బయటకు రావడానికి నానా కష్టాలు పడుతున్నారు.[embed]https://www.youtube.com/watch?v=B0T7aptLDIY[/embed]