జిల్లాకో ప్యాలెస్‌ కోసం భూమి కావాలి కానీ , పరిశ్రమలకెందుకు భూములు అంటోన్న వైసీపీ!?

పెట్టుబడులు వద్దు? కంపెనీలు వద్దు ? ఉద్యోగాలు ఇవ్వొద్దు?! అసలు రాష్ట్రమే బాగుపడొద్దు?! ఇదేనా వైసీపీ నేతలకు కావాల్సింది!? ఐటీని చావుదెబ్బ కొట్టిన గత జగన్ సర్కార్,

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 21, 2025 | 04:58 PMLast Updated on: Apr 21, 2025 | 4:58 PM

The Ysrcp Says The District Needs Land For A Palace But Why Is There Land For Industries

పెట్టుబడులు వద్దు? కంపెనీలు వద్దు ? ఉద్యోగాలు ఇవ్వొద్దు?! అసలు రాష్ట్రమే బాగుపడొద్దు?! ఇదేనా వైసీపీ నేతలకు కావాల్సింది!? ఐటీని చావుదెబ్బ కొట్టిన గత జగన్ సర్కార్, పరిశ్రమలను కూడా తరిమి తరిమి కొట్టింది. అవినీతికే పుట్టి అవినీతి రుచి మరిగి పారిశ్రామిక వేత్తలను భయభ్రాంతులకు గురిచేసింది. కొత్త సంస్థల మాట దేవుడెరుగు ఉన్న వాటిని కూడా పొరుగు రాష్ట్రాలకు పారిపోయేలా చేసింది. ఇప్పుడు కూడా అదే చేయాలని చూస్తోంది!

కూటమి ప్రభుత్వం అదికారంలోకి వచ్చిన నాటి నుండి అన్ని రంగాల అభివృద్ధిపై దృష్టి సారించింది. ముఖ్యంగా పరిశ్రమలు, ఐటీ సంస్థలను తిరిగి రాష్ట్రానికి రప్పించేలా ప్రోత్సాహకాలు, రాయితీలు ప్రకటిస్తోంది. మెరుగైన మౌలిక సదుపాయాలతో పాటు త్వరిత గతిన భూ కేటాయింపులు చేస్తోంది. అయితే ఇక్కడే వైసీపీ నేతల కడుపు మండిపోతోంది. తాము జీవిత కాలం శ్రమించినా తీసుకురాలేని సంస్థలను 11 నెలలోపే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంటో తట్టుకోలేక రగిలిపోతున్నారు.

ఐటీ నగరంగా విశాఖను అభివృద్ధి చేయడంలో బాగంగా టీసీఎస్, గూగుల్ వంటి సంస్థలతో పాటు కాపులఉప్పాడలో డేటా సెంటర్ కోసం ఎకరానికి రూ. 50 లక్షల చొప్పున 56.36 ఎకరాలు, మధురవాడలోని హిల్ నెం.3లో ఐటీ క్యాంపస్ కోసం ఎకరానికి రూ. 1 కోటి చొప్పున 3.5 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి ఉద్యోగాల సృష్టికి 2 సంవత్సరాల గడువు కూడా ఇచ్చింది. అయితే జిల్లాకో పార్టీ ప్యాలెస్ కట్టుకున్న వైసీపీ నేతలకు రాష్ట్ర యువతకు, ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమలకు భూములు ఇస్తే మాత్రం ఓర్పుకోలేక నిత్యం విమర్శలు చేస్తూ ప్రజల దృష్టిలో దిగజారిపోతున్నారు. 11కి పడిపోయినా, ప్రజలు ఛీ కొడుతున్నా పంథా మార్చుకోలేక సోషల్ మీడియాలో విషం చిమ్ముతున్నారు.