అమిత్ షా ముందు బాంబు పేల్చిన లావు.. విజయసాయి రెడ్డి ఇరుక్కుపోయారా…?
ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ స్కాంపై ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేగుతున్నాయి. పార్లమెంట్ వేదికగా నరసారావుపేట ఎంపీ లావు కృష్ణ దేవరాయలు లిక్కర్ స్కాం పై సంచలన వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే కీలక పరిణామం చోటు చేసుకుంది.

ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ స్కాంపై ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేగుతున్నాయి. పార్లమెంట్ వేదికగా నరసారావుపేట ఎంపీ లావు కృష్ణ దేవరాయలు లిక్కర్ స్కాం పై సంచలన వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఎంపీని పిలిచి వివరణ అడగగా.. లిక్కర్ స్కాంపై పూర్తి ఆధారాలను కేంద్ర హోం మంత్రి ముందు ఉంచారు లావు. దీనితో ఈడీ విచారణ చేపడతామని అమిత్ షా హామీ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే సందర్భంగా లావు పలు కీలక విషయాలను హోం మంత్రి దృష్టిలో పెట్టినట్టు తెలుస్తోంది.
లిక్కర్ స్కాంలో విజయసాయి రెడ్డి పాత్ర ఉందనే విషయాన్ని ఎంపీ పరోక్షంగా చెప్పినట్టు సమాచారం. ఆ భయంతోనే విజయసాయి రెడ్డి.. రాజకీయాల నుంచి తప్పుకున్నారని, ఎంపీ పదవికి రాజీనామా చేసి సైలెంట్ అయ్యారని.. లావు ఆధారాలు సమర్పించినట్టు తెలుస్తోంది. ఇక దుబాయ్ తో పాటుగా ఆఫ్రికా దేశాలకు భారీగా నిధులు తరలించారని… 99 వేల కోట్ల రూపాయల మద్యం విక్రయిస్తే కేవలం 650 కోట్లకు మాత్రమే డిజిటల్ లావాదేవీలు జరిగాయనే విషయాన్ని కూడా ఎంపీ హోం మంత్రి దృష్టికి తీసుకువెళ్ళారు. దీనితో విజయసాయి రెడ్డి ఏపీ రాజకీయాల్లో మరోసారి సంచలనంగా మారారు.