Telangana BJP : బీజేపీలో వింత సమస్య.. మాకు టికెట్లు వద్దు అంటూ కొందరు.. వారికి వద్దు అంటూ మరికొందరు..

తెలంగాణ బీజేపీ ( Telangana BJP )లో వింత పరిస్థితి తలెత్తుతున్నాయి. బహుశ మునుపెన్నడూ ఇలాంటి పరిస్థితి బీజేపీ కి ఎదురైయింది లేదు అనుకుంటా.. ఇక విషయంలోకి వెల్తే తెలంగాణ బీజేపీలో కొందరు నేతలు తమకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తాము అంటే వద్దు అంటూ మొహం మీద చేస్తేస్తున్నారాంటా.. అయినయ పట్టు బట్టి బీజేపీ అధిష్ఠానం టికెట్లు కేటాయించింది. మరో వైపు 7 - 8 స్ధానాల్లో జనసేనకు టికెట్లు ఇవ్వాలని జనసేన ( Jana Sena ) కోరుతుంది. ఈ ఎన్నికల్లో పోటీ చెయబోనని మాజీ ఎమ్మెల్యే బాబుమోహన్ ( Babu Mohan ) మీడియా ముఖంగా ప్రకటించిన విషయం తెలిసిందే..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 3, 2023 | 04:50 PMLast Updated on: Nov 03, 2023 | 5:00 PM

There Is A Strange Problem In Bjp Some Say We Dont Want Tickets Some Say They Dont

తెలంగాణ బీజేపీ ( Telangana BJP )లో వింత పరిస్థితి తలెత్తుతున్నాయి. బహుశ మునుపెన్నడూ ఇలాంటి పరిస్థితి బీజేపీ కి ఎదురైయింది లేదు అనుకుంటా.. ఇక విషయంలోకి వెల్తే తెలంగాణ బీజేపీలో కొందరు నేతలు తమకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తాము అంటే వద్దు అంటూ మొహం మీద చేస్తేస్తున్నారాంటా.. అయినయ పట్టు బట్టి బీజేపీ అధిష్ఠానం టికెట్లు కేటాయించింది. మరో వైపు 7 – 8 స్ధానాల్లో జనసేనకు టికెట్లు ఇవ్వాలని జనసేన ( Jana Sena ) కోరుతుంది. ఈ ఎన్నికల్లో పోటీ చెయబోనని మాజీ ఎమ్మెల్యే బాబుమోహన్ ( Babu Mohan ) మీడియా ముఖంగా ప్రకటించిన విషయం తెలిసిందే.. అయినా బీజేపీ హైకమాండ్ మాత్రం బాబు మోహన్ కు టికెట్ కేటాయిస్తు లిస్ట్ విడుదల చేసింది. ఆయన ఒక్కరే కాకుండా ఇలా చాలామందికి ఈ సారి మూడో జాబితాలో సీట్లు కేటాయించింది బీజేపీ అధిష్ఠానం. అయినప్పటికీ తమకు టికెట్లు వద్దు అంటూ రాష్ట్ర పెద్దలను కలిసేందుకు సిద్ధమవుతున్నారు నేతలు.

YSRTP : షర్మిల ఔట్ ! పోటీ నుంచి తప్పుకున్న YSRTP

ఈ సారి ఎలాగైనా తెలంగాణ ఎన్నికల్లో ( Assembly Elections ) పోటీ చేయాలని నాగర్ కర్నూల్, తాండూరు, శేరిలింగపల్లి, కూకట్ పల్లి టికెట్లు ఇవ్వాలని బీజేపీకి విజ్ఞప్తి చేసింది జనసేన. బీజేపీ తాండూరు టికెట్ లలో ఒకటి జనసేనకు కేటాయించిన పార్టీకి రాజీనామా చేస్తానని మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీ పార్టీకి హెచ్చరించారు. ఇక కూకట్ పల్లి టికెట్ ను జనసేనకు కేటాయిస్తున్నారని ప్రచారంతో.. ఆ నియోజకవర్గం బీజేపీ కార్యకర్తలు ఏకంగా పార్టీ కార్యాలయం ఎదుట పోస్టర్లు అతికించారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఈ నాలుగు టిక్కెట్లకు బదులుగా మరో నాలుగు కలిపి రెట్టింపు సీట్లు అంటే 8 సీట్లు ఇస్తామని వేరే నియోజకవర్గాలను కోరుకోవాలని జనసేనకు ఆఫర్ ఇచ్చింది బీజేపీ.

http://రాజకీయ వ్యూహం.. రజనీపై విజయ్ సంచలన కామెంట్స్

ఇక హైదరాబాద్ లోని ముఖ్య నియోజకవర్గంలోని ఒకటి ముషీరాబాద్ ఈ టికెట్ కోసం సోంత పార్టీ వాళ్ల మద్యే పోటీ తీరస్థాయికి చేరింది. ముషీరాబాద్ టికెట్ కోసం హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ మధ్య మూడు నెలల నుంచి పోరు సాగుతుంది. బయట పడకుండా లోలోపల మంతనాలు జరుపుతున్నారు ఇరు నేతలు. ఈ సారి ముషీరాబాద్ నుంచి దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి కి టికెట్ ఇప్పించి అసెంబ్లీకి పంపిచాలని ఢిల్లీ పెద్దలతో చర్యలు జరిపినప్పటికి ఆవి విఫలమయ్యాయి.. చివరికి ముషీరాబాద్ టికెట్ ను లక్ష్మణ్ అనుచరుడు పూస రాజు కు టికెట్ కేటాయిస్తే బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.

SURESH