రాజకీయాల్లో బళ్ళు ఓడలు... ఓడలు బళ్ళు అవడం పెద్ద మ్యాటర్ కాదు. కాకపోతే అటు ఇటు జరిగినప్పుడు ఎలా మేనేజ్ చేస్తారు అనేది రాజకీయాల్లో కీలకం. రాజకీయ నాయకులను అరెస్ట్ కేసులు పెట్టడం అన్నీ కాస్త కామన్ విషయాలు ఈ మధ్యకాలంలో. ఒకప్పుడు అంటే రాజకీయ నాయకులు కేసులకు భయపడ్డారు. కానీ ఈమధ్య పెద్దగా కేసులను సీరియస్ గా తీసుకోవడం లేదు. సింపతీ ఫ్యాక్టర్ గా వాడుకోవడం మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో కూడా అరెస్ట్ అయిన వాళ్లకు కాస్త ఎక్కువ సానుభూతి వస్తుంది. దానికి తోడు కొంత మంది రాజకీయ నాయకులు కక్ష సాధింపుగా అరెస్టులు చేయడం వంటివి కూడా జరుగుతున్నాయి. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ అరెస్ట్ అయినప్పుడు ఆయనకు కొంత సానుభూతి వచ్చింది. ఆ సానుభూతి వైసీపీకి కాస్త బలాన్ని ఇచ్చింది అనే విషయం అందరికీ క్లారిటీ ఉంది. అప్పట్లో వైయస్ జగన్... సోనియా గాంధీకి ఎదురెళ్లి అరెస్టు కావడం ఒక సెన్సేషన్ అయింది. ఇక ఆ తర్వాత లాలు ప్రసాద్ యాదవ్ అరెస్ట్ అయితే ఆయనపై కూడా కాస్త బీహార్లో సానుభూతి వచ్చింది. ఇప్పటికీ ఆ సానుభూతి అలాగే ఉంది. ఆయన పార్టీ అధికారంలోకి రాకపోయినా బీహార్ ప్రజల్లో మాత్రం లాలూ ప్రసాద్ యాదవ్ ను బిజెపి కావాలనే ఇబ్బంది పెట్టింది అనే ఒపీనియన్ అయితే క్రియేట్ అయింది. ఇక ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు... 2023లో ఏపీ ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడుని అప్పటి ప్రభుత్వం అదుపులోకి తీసుకుని దాదాపు 55 రోజులు పాటు ఆయనను జైల్లోనే ఉంచారు. ఆ సమయంలో చంద్రబాబుకు ఎప్పుడు లేని విధంగా ఇమేజ్ క్రియేట్ అయింది. చంద్రబాబును అరెస్టు చేసే సమయంలో రోడ్లపై జనాలు బారులు తీరారు. ఆ తర్వాత చంద్రబాబు బెయిల్ పై రిలీజ్ అయిన తర్వాత కూడా మంచి క్రేజ్ వచ్చింది. రోడ్డు మార్గంలో చంద్రబాబు హైదరాబాద్ చేరుకోవడం... దీనికి దారి పొడవున ప్రజలు పెద్ద ఎత్తున బ్రహ్మరధం పట్టడం జరిగింది. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి అది సహకరించింది అనే అభిప్రాయం కూడా ఉంది. ఇక ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ను అరెస్టు చేయడం కూడా ప్రజల్లో సానుభూతి పెంచింది. దేశవ్యాప్తంగా ఆయనను కావాలనే టార్గెట్ చేశారనే ఒపీనియన్ కూడా ఇప్పటికీ కొందరిలో ఉంది. కానీ తెలంగాణలో మాత్రం ఈ పరిస్థితి కాస్త డిఫరెంట్ గా ఉంది. అప్పట్లో రేవంత్ రెడ్డిని అరెస్టు చేసినప్పుడు సామాన్య ప్రజల్లో సానుభూతి వ్యక్తం అయింది. రేవంత్ రెడ్డిని కావాలని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ టార్గెట్ చేశారనే అభిప్రాయాలు కూడా వినిపించాయి. కానీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేసిన తర్వాత తెలంగాణ ప్రజల్లో పెద్దగా సానుభూతి రాలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ సానుభూతి కలిసోస్తుందని కేసీఆర్ అప్పట్లో భావించారు. కానీ అది అనుకున్న విధంగా జరగలేదు. ఇక ఇప్పుడు కేటీఆర్ విషయంలో కూడా ప్రజల్లో పెద్దగా సానుభూతి కనపడటం లేదు. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేయడం.. ఆ తర్వాత ఈడీ అధికారులు ఆ కేసును టేకప్ చేయడం వంటివి జరిగాయి. కేటీఆర్ ను దాదాపుగా అరెస్టు చేసే వరకు పరిస్థితి వెళ్ళింది. అయినా సరే ఆయన పై సానుభూతి పెద్దగా కనబడటం లేదు. సోషల్ మీడియాలో కూడా భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు ఎక్కడా ఎమోషనల్ అయినట్లు కనపడలేదు. ఎక్కడో కొంతమంది పార్టీ నాయకులు చేసిన హడావుడి తప్పించి పెద్దగా బీఆర్ఎస్ సోషల్ మీడియా ఈ విషయంలో రియాక్ట్ అయినట్లుగా కూడా లేదు. తన అరెస్టు కచ్చితంగా పార్టీకి కలిసి వస్తుందని కేటీఆర్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. పార్టీ నేతలు కూడా కేటీఆర్ అరెస్టుతో సానుభూతి వస్తుందని వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా అధికార పీఠంపై కూర్చుంటామని ధీమాగా వ్యక్తం చేసారు ముందు. కానీ సినిమా మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది. కేటీఆర్ ను అరెస్టు చేయడం పక్కా అనే అనుమానంలో ఆ పార్టీ నేతలు ఉన్నారు. దీనితో తమ దారి తాము వెతుక్కునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ప్రజల్లో కూడా కేటీఆర్ అరెస్టుపై పెద్దగా చర్చ జరగడం లేదు. గతంలో ఏ రాజకీయ నాయకుడిని అరెస్టు చేసిన సరే ప్రజల్లో ఒక రకమైన చర్చ జరిగేది. సానుభూతి రావటమో లేదంటే తిట్టడం ఏదో ఒకటి ఉండేది. కానీ కేటీఆర్ విషయంలో చాలావరకు పరిస్థితి కూల్ గానే కనబడుతోంది. భారత రాష్ట్ర సమితి లీడర్లు చేస్తున్న హడావుడి మినహా ఆ పార్టీ కార్యకర్తలు కూడా పెద్దగా రియాక్ట్ అయిన దాఖలాలు లేవనే చెప్పాలి. అప్పట్లో ఎవరని అరెస్టు చేసిన సరే రోడ్లమీదకి వచ్చి నిరసనలు కూడా చేసేవారు. కేసులు పెట్టిన సరే ఆ కేసులు కొట్టేయాలంటూ ధర్నాలు రాస్తారోకోలు వంటి కార్యక్రమాలు జరిగాయి. కానీ కేటీఆర్ విషయంలో మాత్రం ఇవేవీ జరగటం లేదు. ఆయనను గురువారం దాదాపుగా అరెస్టు చేసే అవకాశం ఉందని వార్తలు వచ్చిన సరే పెద్దగా ఆ పార్టీ క్యాడర్ లో కంగారు ఎక్కడా కనబడలేదు. కేటీఆర్ లో మాత్రం అరెస్టు భయం స్పష్టంగా కనబడుతోంది.[embed]https://www.youtube.com/watch?v=l6suszUzQ-g[/embed]