తిరుపతిలోని స్విమ్స్ హాస్పిటల్ వద్ద కాసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడే సమయంలో అక్కడికి వైసీపీ అధినేత జగన్ అక్కడికి చేరుకోవడంతో వాతావరణం గందరగోళంగా మారింది. దీంతో ఇరుపార్టీల నినాదాలతో హాస్పిటల్ ప్రాంగణం ఒక్కసారిగా హోరెత్తుతోంది. అరగంట ఆలస్యంగా రావాలని పోలీసులు చెప్పిన వినకుండా జగన్ అక్కడికి చేరుకోవడంతో వైసీపీ కార్యకర్తలు కూడా భారీగా అక్కడికి చేరుకున్నారు. ఇక అక్కడి నుంచి ఓవైపు జై జగన్.. మరోవైపు జై జనసేన అంటూ పార్టీల కార్యకర్తలు నినాదాలు చేయడంతో వాతావరణం హీట్ ఎక్కింది. [embed]https://www.youtube.com/watch?v=wRDA2VNpvYM[/embed]